నిజమే… టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ విషయంపై అయినా చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉంటుంది. ఈ విషయం దాదాపుగా అన్ని స్థాయిల అధికార యంత్రాంగానికీ తెలుసు. ఏ విషయం అయినా పకడ్బందీగా ఉంటే తప్పించి చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్న ఆసుపత్రుల్లో చెత్తా చెదారం కనిపిస్తే… చంద్రబాబు ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితే శనివారం ఎదురు కాగా…అధికార యంత్రాంగంపై చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఆసుపత్రుల ఆవరణలో చెత్త కనిపించడం లేదా?… దానిని తీసివేయించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియదా? అంటూ ఆయన ఓ రేంజిలో ఫైరయ్యారు.
చంద్రబాబు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కుప్పం చేరుకున్న చంద్రబాబు…శనివారం కూడా కుప్పంలోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పలు అధునాతన సౌర్యాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తూ సాగిన చంద్రబాబుకు అక్కడ ఓ మూల చెత్తా చెదారంతో నిండిపోయిన వైనం కనిపించింది. అప్పటిదాకా శాంతంగానే కనిపించిన చంద్రబాబు… ఆ చెత్త కంటబడిన వెంటనే అసహనానికి గురయ్యారు. ఆసుపత్రి పరిసరాల్లో చెత్త ఉండటం ఏమిటి? ఉన్నా.. దానిని పరిశుభ్రం చేయాలని అనిపించలేదా? అని ఆయన అక్కడి అధికారులపై ఫైరయ్యారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి…చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి షాకయ్యారు. పరిస్థితిని చంద్రబాబుకు వివరించే యత్నం చేశారు. అయితే ఆమె మాటను చంద్రబాబు పూర్తిగా వినలేదు. ఆసుపత్రి ఏరియాలో చెత్తాచెదారాన్ని అలాగే పెట్టేసి… దానిని సమర్థించుకునే దిశగా ఏం మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా? అని ఆమెపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరత్రా జనావాసాలనే పరిశుభ్రంగా ఉంచాలని చెబుతుంటే… ఏకంగా ఆషుపత్రి ఆవరణలోనే చెత్త పేరుకుపోయినా కనిపించడం లేదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి హడలెత్తిపోయిన ఆసుపత్రి సూపరింటెండ్ ఏదో సర్దిచెప్పే యత్నం చేయబోగా…చంద్రబాబు ఆమె నోటికి అడ్డుకట్ట వేసేశారు. అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ ను పిలిచి… ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని, కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ పని ఎప్పుడు చేయాలన్న దానిపై ఓ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పరిసరాల పరిశుభ్రదతతో పాటుగా ఆ పరిస్థితులను అలాగే కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మొత్తంగా తప్పు జరిగితే చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన అదికారులు ఎక్కడివారక్కడ సర్దుకున్నారు.
This post was last modified on July 4, 2026 11:20 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…