మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది కూడా భాగమనే విషయం చాలా మంది తెలియదు. కానీ, ఫారం పూర్తి చేస్తుంటే వచ్చే ప్రశ్నల్లో ఇది కూడా ఉంది. మీరు భారతీయులేనా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అయితే.. భారతీయత్వం ఎలా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రజల వద్ద ఉన్న ఏ గుర్తింపు కార్డు కూడా పౌరసత్వం నిరూపణకు పనికిరాదు!.
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది వాస్తవం. ప్రస్తుతం ప్రజల దగ్గర అనేక కార్డులు ఉన్నాయి. ఓటరు, పాన్, ఆధార్, పాస్ పోర్టు, పనిచేసే కార్యాలయాలు ఇచ్చే గుర్తింపు కార్డులు సహా.. రేషన్‌కార్డు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే.. ఇవేవీ మీరు భారతీయులేనా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవు. ఎందుకంటే.. ఈ కార్డులు ఏవీ కూడా పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు లేదా మద్దతు ఇచ్చేందుకు పనికిరావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అన్ని గుర్తింపు కార్డుల్లోనూ పాస్ పోర్టు అత్యంత కీలకం. అయితే.. ఇది కేవలం విదేశాలకు వెళ్లేందుకు కేంద్రం ఇచ్చే కార్డుగానే ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిని కేంద్రం కూడా ఆమోదించింది. ఇక, ఆధార్ కార్డు ఉన్నప్పటికీ.. ఇది కూడా కేవలం గుర్తింపు కోసమే తప్ప.. భారతీయ పౌరులుగా చలామణి అయ్యేందుకు కుదరదు. అలానే ఓటరు కార్డు కూడా పౌరసత్వ గుర్తింపునకు పనికి రాదని కేంద్ర ఎన్నికల సంఘమే వెల్లడించింది.
మరి ఏం చేయాలి?
దీనికి పరిష్కారం.. కేంద్రం ఇచ్చే సిటిజన్ షిప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఇప్పటి వరకు దేశంలో 80 శాతం మంది ప్రజలకు తెలియకపోవడం గమనార్హం. కానీ.. ఇప్పుడే ఈ విషయంపై కేంద్రం కూడా అవగాహన కల్పిస్తోంది. సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. 20 నుంచి 30 రోజుల్లో సర్టిఫికెట్ ఇస్తారు. లేదా 1987కు ముందు జన్మించినట్టు గుర్తించే ఆధారం ఉంటే అది చెల్లుబాటు అవుతుంది. ఇవి మినహా ఏవీ కూడా భారత పౌరులకు పౌరసత్వం ఉన్నట్టుగా గుర్తించే ఆధారాలు లేకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates