అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా మారింది. ఒక్కసారి గ్రీన్ కార్డు సాధిస్తే.. ఇక, తిరుగులేదు. గ్రీన్ కార్డు దక్కించుకున్న ఇక, తాము అమెరికా పౌరులమని.. తమకు అన్ని చట్టాలు సమానంగానే వర్తిస్తాయని భావిస్తారు. ఇది సాధారణంగా అందరిలోనూ ఉండే భావన. అయితే.. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది.
గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన.. ఏమైనా చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. అది ఏదేశ పౌరులకైనా వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అమెరికా పౌరులు, ఇక్కడ పుట్టిన వారికి, జన్మతో దక్కే హక్కులు గ్రీన్ కార్డు పౌరులకు యథాతథంగా వర్తించబోవని స్పష్టం చేసింది. వారు ఇతర దేశాల నుంచి వచ్చి.. ఇక్కడ జీవించేందుకు.. మాత్రమే గ్రీన్ కార్డు వర్తిస్తుందని.. ఇక్కడి హక్కులు వారికి సంపూర్ణంగా వర్తించవని స్పష్టం చేసింది.
అంతేకాదు.. గ్రీన్ కార్డు ఉందని.. నేరాలు, ఘోరాలకు పాల్పడి.. ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. గ్రీన్ కార్డు దారుడైన ఓ చైనా వ్యక్తి చేసిన నేరానికి సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గ్రీన్‌కార్డు అనేది.. కేవలం నివాసానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మాత్రమే. అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిని అడ్డు పెట్టుకుని నేరాలు చేయడం, డబ్బులు సంపాయించడం వంటివి కుదరదని తేల్చి చెప్పింది.
ఇలా చేసిన వారిని వెంటనే.. దేశం నుంచి బహిష్కరించవచ్చని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు సంపూర్ణ అధికారాలు ఉంటాయని పేర్కొంది. అయితే.. సంబంధిత గ్రీన్ కార్డు హోల్డర్ నేరం చేసినట్టు పక్కా ఆధారాలను సేకరించాల్సి ఉంటుందని హోం ల్యాండ్ సెక్యూరిటీకి సుప్రీంకోర్టు సూచించింది. నేరం చేసిన వారు ఎంతటి వారైనా.. విదేశీయులు అమెరికాలో ఉండేందుకు అర్హులు కారని పేర్కొంది. సో.. గ్రీన్ కార్డు ఉందని గొప్పలకు పోతే.. దేశబహిష్కరణ తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates