ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్టాన్ని జెట్ స్పీడుతో అభివృద్ది చేస్తోందంటూ టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబితే… ఏదో అనుకున్నాం గానీ… వాస్తవాలు చూస్తుంటే… ఆయన చెప్పిన స్పీడును అందుకోవడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత కరువు సీమగా ముద్రపడిన రాష్ట్రంలోని రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని నిజంగానే రతనాల సీమగా తీర్చిదిద్దుతోంది. అందుకు నిదర్శనంగా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిదర్వనమని చెప్పవచ్చు.
ఇప్పటికే రాయలసీమలో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తన బుల్లెట్ బైకుల తయారీ యూనిట్ ను రాయలసీమలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడులో ఆ పరిశ్రమకు ఇటీవలే భూమి పూజ జరగగా… మొన్నటికి మొన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఫైటర్ జెట్ పరీక్షా కేంద్రానికి భూమి పూజ జరిగింది. తాజాగా ఫ్యాక్షన్ కు అడ్డాగా పేరున్న కడప జిల్లా జమ్మలమడుగులో సోలార్ విద్యుత్ తయారీ కోసం ఏర్పాటు చేయబడిన భారీ పరిశ్రమను మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్… ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా జమ్మలమడుగులో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ కు 11నెలల క్రితం అంకురార్పణ జరిగింంది. సోలార్ పవర్ జనరేషన్ లో అగ్రగామిగా ఉన్న సీల్ (ఎస్ఈఏఎల్- సస్టెయినబుల్ అండ్ అఫార్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్) సంస్థ ఏపీ ప్రభుత్వంతో 11 ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఎడారి ప్రాంతంగా ఉన్న రాయలసీమకు చెందిన కడప జిల్లా జమ్మలమడుగులో రూ.3000 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్టాంట్ ను ఏర్పాటు చేసే దిశగా సీల్ సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. ఈ సంస్థకు అవసరమైన భూమి, ఇతరత్రా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం జెట్ స్పీడుతో అందించింది. ఈ స్పీడును చూసిన సీల్ కూడా తానూ జెట్ స్పీడుతోనే సాగి… కేవలం 11 నెలల వ్యవధిలోనే ఈ భారీ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates