భగీరథ్ కేసుపై రేవంత్ లాజిక్

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాజ‌కీయాల్లో బండి భగీర‌థ్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక మైన‌ర్ బాలిక మీద లైంగిక దాడి చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోద‌వ‌డం సంచ‌ల‌నం రేపింది. ఐతే ఈ కేసు న‌మోదైన వారానికి కూడా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం భ‌గీర‌థ్‌ను అరెస్టు చేయ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

రేవంత్‌కు ఉన్న రాజకీయం స్నేహం దృష్ట్యా భగీరథ్ ను సీఎం రేవంత్ కాపాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్లు. ఈ కేసులో బాధితురాలికి అన్యాయం జ‌రుగుతోంద‌నే అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ఈ కేసు విష‌య‌మై రేవంత్ ఎట్ట‌కేల‌కు స్పందించారు. వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో ఈ వ్య‌వ‌హారంపై రేవంత్ క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా, లాజిక‌ల్‌గా మాట్లాడారు.

ఈ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రూ పిల్ల‌లే అని.. తాము ఎవ‌రి వైపునా లేమ‌ని.. చ‌ట్ట‌ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు. బాధితురాలికి తాము వ్య‌తిరేకం అయితే భ‌గీర‌థ్ మీద పోక్సో కేసు ఎందుకు పెడ‌తామ‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. ఐతే ఆమె కేసు పెట్ట‌డానికి ముందే భ‌గీర‌థ్ కేసు పెట్టాడ‌ని.. మ‌రి ఆ కేసు కూడా తీసుకుని విచారించాలి క‌దా అని ఆయ‌న‌న్నారు.

బాధితురాలు అస‌లు మైన‌రే కాదు అని వాళ్లు ఆరోపిస్తున్నార‌ని.. అలాంట‌పుడు ఆమె మైన‌రా కాదా అనే విష‌యాన్ని నిర్ధ‌రించ‌డాడానికి ఒక‌ట్రెండు రోజులు స‌మ‌యం ప‌ట్ట‌దా అని ఆయ‌న అడిగారు. భ‌గీర‌థ్ కేసు పెట్టింది క‌రీంన‌గ‌ర్లో అయితే.. బాధితురాలు హైద‌రాబాద్‌లో కేసు పెట్టింద‌ని.. పైగా కేసులు న‌మోదైంది రాత్రి అని.. రెండు చోట్ల నుంచి పోలీసులు కోఆర్డినేట్ చేసుకోవాలి క‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఈ కేసులు న‌మోదైన త‌ర్వాతి రోజు నుంచే రెండు రోజుల పాటు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో 10 వేల మంది పోలీసుల‌ను మోహ‌రించాల్సి వ‌చ్చింద‌ని.. హైద‌రాబాద్ లాంటి సెన్సిటివ్ సిటీలో ప్ర‌ధాని ఆరు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే సెక్యూరిటీ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించాలో అంద‌రికీ తెలియ‌దా.. మ‌రి పోలీసుల‌కు ఈ కేసుల్ని వెంట‌నే తేల్చే టైం ఎక్క‌డుంది అని ఆయ‌న‌డిగారు.

భ‌గీర‌థ వైపు నుంచి కేసు తీసుకోక‌పోతే.. పోక్సో కేసు కింద భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్ట్ చేస్తే రాజ‌కీయ కక్ష‌తోనే ఇలా చేశార‌ని మీడియా వాళ్లు అంటార‌ని.. ఇంకోవైపు త‌న‌పై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు బాధితురాలు చెప్పిన ఘ‌ట‌న ఐదు నెలల ముందు జ‌రిగింద‌ని.. దానికి సంబంధించిన ఆధారాలు సేక‌రించ‌డానికి టైం ప‌డుతుంది క‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇవ‌న్నీ చూసుకునే తాము ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని.. భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్ట్ చేయ‌లేదు, ఉరి తీయ‌లేదు అంటే కుద‌ర‌ద‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. ఈ కేసులో భగీర‌థ్‌ను అతని తండ్రే తెచ్చి పోలీసుల‌కు అప్ప‌గించాల‌ని.. త‌న కొడుకు త‌ప్పు చేయలేద‌ని అనుకుంటే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మేముంద‌ని రేవంత్ అన్నారు.