ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ డిఎంకె ఓటమిలో పరోక్ష పాత్ర పోషించిందని విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలను కూడా పట్టించుకోకుండా టీవీఫకే అధినేత విజయ్ అడిగిన వెంటనే డీఎంకేతో రాహుల్ గాంధీ తెగదెంపులు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. అంతేకాదు, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల పక్కన తమకు కేటాయించిన సీట్లు మార్చాలని స్పీకర్ ఓం బిర్లాకు స్టాలిన్ లేఖ రాశారు.
తాజా పరిణామాలతో ఇండి కూటమి మరింత బలహీన పడింది. ఆల్రెడీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీతో పొత్తులేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ కూడా కూటమి నుంచి వైదొలగడంతో కూటమిలోని పార్టీల సంఖ్య మరింత తగ్గిపోయింది. ఓవైపు ఎన్డీఏ కూటమి నానాటికి బలపడుతుంటే ఇండి కూటమి మాత్రం రోజురోజుకీ బలహీనపడుతోంది.
రాహుల్ గాంధీ అనాలోచిత నిర్ణయాలు… సమయానికి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి పలు కారణాలతో ఇప్పటికే 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. రాహుల్ నాయకత్వం చూసి మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది.
ఇకనైనా రాహుల్ గాంధీ తన వ్యూహాలకు పదును పెట్టి రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు వ్యూహరచన చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలి పోవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates