తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విజయ్ విజయం సాధించారు.
పెరంబూరులో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ పై 40 వేల ఓట్ల తేడాతో విజయ్ గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మరోవైపు మ్యాజిక్ ఫిగర్ 118 కి అడుగు దూరంలో టీవీకే నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని విజయ్ తండ్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుంది. .
కాగా, తమిళనాడుకు కాబోయే సీఎం విజయ్ కులమేంటి అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, విజయ్ కులం స్థానంలో ఆయన తండ్రి చంద్రశేఖర్ ‘తమిళం’ అని విజయ్ చదువుకునే రోజుల్లోనే పాఠశాల రికార్డుల్లో పొందుపరిచారు.
అయితే విజయ్ చదువుతున్న పాఠశాల వారు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆందోళనకు దిగుతానని చంద్రశేఖర్ హెచ్చరించడంతో విజయ్ కులం తమిళం గానే కొనసాగుతోంది.
This post was last modified on May 4, 2026 6:29 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…