Political News

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట… పాత పద్ధతులు…వెరసి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయింది. బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త
విదానాలు, వ్యూహాలు రచిస్తూ మునుపెన్నడూ గెలువని రాష్ట్రాలలో కూడా భారీ విజయాలు సాధిస్తుంటే…కాంగ్రెస్ మాత్రం తమ తమకు కంచుకోట వంటి స్థానాలను కూడా స్వయంకృతాపరాధాలతో
బద్దలు కొట్టించుకుంటోంది.

ఇక, కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద తలనొప్పి అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలకు మధ్య సఖ్యత లేకపోవడం..సీఎం కుర్చీ కోసం సిగపట్లు… ఈ బలహీనతల వల్లే ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ లోకువైంది.

కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారం కోల్పోయిన సరే ఆ పార్టీ నేతల తీరు మారినట్లు కనిపించడం లేదు. కేరళంలో యూడీఎఫ్ విజయం సాధించే దిశగా ఆధిక్యంలో కొనసాగుతుండగా…సీఎం ఎవరు అన్న పంచాయతీ మొదలైంది.

నేనంటే నేను అంటూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం మ్యూజికల్ చెయిర్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం సీట్ ఫైట్ కొత్త కాదు. కానీ, ఓ పక్క బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సైతం బీజేపీ పాగా వేస్తోంటే… కాంగ్రెస్ మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం తమ పార్టీ నేతల మధ్య జరిగే ముష్టియుద్ధాలను ఆపలేకపోతోంది.

ఇప్పటికైనా పాత చింతకాయ పచ్చడి పద్ధతులు మార్చుకొని… రోటీన్ సీఎం సీటు పంచాయతీలు ఎన్నికలకు ముందే తేల్చుకొని కాంగ్రెస్ తన తప్పులు సరిదిద్దుకోకుంటే రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచి పెద్దగా అద్భుతాలు ఆశించడం అనవసరం.

This post was last modified on May 4, 2026 2:17 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

9 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago