తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి వచ్చేందుకు మాత్రం ఈ సంఖ్య సరిపోదు. మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. అయితే.. అప్పుడు కూడా.. బొటాబొటి మార్కులతోనే అధికారంలోకి వచ్చినట్టు అవుతుంది. కానీ, ఇలా వస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు ఆప్షన్‌లు విజయ్‌కు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే.. వారిని చేరదీయడం. కానీ.. ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ విజయం దక్కించుకోలేదు. ఒకవేళ దక్కించుకున్నా.. 8 మందిని చేరదీసే పరిస్థితి లేదు. దీంతో రెండో ఆప్షన్ ఆది నుంచి పొత్తుకు సరితూ గుతున్న అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి వైపు విజయ్ మొగ్గు చూపాలి. ఈ కూటమికి 72 స్థానాల్లో విజయం దక్కే అవకాశం కనిపిస్తోంది.
అప్పుడు 110+72 కలిసి 182 స్థానాలతో ఈ కూటమి అధికారంలోకివ చ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇక్కడ విజయ్‌కు చిన్న చిక్క ఉంది. తాను బీజేపీని వ్యతిరేకిస్తున్నానని.. ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే మైనారిటీ ఓటర్లు.. ముఖ్యంగా క్రిస్టియన్ ఓటర్లు విజయ్‌కు మొగ్గు చూపారు. ఇప్పుడుపోయి పోయి బీజేపీ ఉన్న కూటమిలో చేరితే ఆయనపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్న.
కానీ, మరో అవకాశం, ప్రత్యామ్నాయం వంటివి ఏవీ కూడా విజయ్‌కు కనిపించడం లేదు. బీజేపీకి తక్కువ సీట్లే రావడంతో పళనిస్వామి కమలాన్ని వదిలి విజిల్ పట్టుకుంటారా అనే విశ్లేషణలు సాగుతున్నాయి. 8 సీట్ల కోసమనే కాదు.. సుస్థిర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మనగలగాలంటే.. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమితో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇది జరిగితే.. ముఖ్యమంత్రిగా విజయ్.. ఉప ముఖ్యమంత్రిగా పళని స్వామి పదవులు చేపట్టే చాన్స్ ఉంది. అలా కాదంటే.. రాష్ట్రంలో అధికార పీఠంపై సందిగ్ధత ఏర్పడి.. హంగ్ దిశగా అడుగులు వేయకతప్పదు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates