Political News

పిచ్చి పీక్స్… అమెరికా పాస్ పోర్టులో ట్రంప్ ఫోటో

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు.. ఇలాంటి ఒక అధ్యక్షుడు పాలించాడా? అన్న అనుమానం భవిష్యత్ తరాలకు కలిగేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు తరచూ సంచలనంగా మారుతున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ కు రోజులు గడుస్తున్నకొద్దీ కీర్తి కాంక్ష విపరీతంగా పెరుగుతోంది. మొన్నటివరకు నోబెల్ శాంతి పురస్కారం మీద మనసు పడ్డా.. అదేమీ సాధ్యం కాలేదు.

ఈ ఏడాది జులై 4తో అమెరికాకు స్వాతంత్య్రం సిద్ధించి 250 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ఈ చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాల్ని ప్రకటిస్తున్న ట్రంప్.. విస్మయానికి గురి చేసేలా నిర్ణయాల్ని తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తన చిత్రంతో 24 క్యారెట్ల బంగారు స్మారక నాణేన్ని రూపొందించటానికి వీలుగా ఫెడరల్ కమిషన్ సైతం ఓకే చెప్పేసింది. ట్రంప్ లాంటి అధ్యక్షుల వారు ఒకసారి డిసైడ్ అయితే.. దాన్ని పూర్తి అయ్యే వరకు వదలరు. అలాంటి సమయంలో అధ్యక్షుల వారి మాటను కాదనే పరిస్థితి కనిపించదు.

అమెరికా చరిత్రలో జీవించి ఉన్నప్పుడే నాణెంపై ఫోటోను వేసుకున్న ఘనత సాధించిన రెండో అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు. ఈ నాణెంపై ఓవల్ ఆఫీసులోని రెజల్యూట్ డెస్కు మీద చేతులు పెట్టి.. బిగించిన పిడికిలితో ఉన్న ట్రంప్ చిత్రం ఉంటుందని చెబుతున్నారు. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

వచ్చే జులైలో అమెరికా విదేశాంగ శాఖ తమ దేశ పాస్ పోర్టులో ట్రంప్ ఫోటోను ముద్రిస్తుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవటం ఇప్పుడు అమెరికన్ల వంతైంది.

ట్రంప్ మొండితనం గురించి తెలిసిందే. తాను ఒకసారి డిసైడ్ అయ్యాక.. ఆ విషయం నుంచి వెనక్కి తగ్గటం ట్రంప్ లో కనిపించదు.ట్రంప్ ఫోటోతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్ పోర్టులను పరిమితంగా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ పాస్ పోర్టులో ఒక పేజీ మొత్తంలో ట్రంప్ ఫోటో ఉంటుందని.. పాస్ పోర్టులో స్వాతంత్య్ర ప్రకటన పత్రంపై ట్రంప్ ఫోటో ఉంటుందని చెబుతున్నారు.

దాని కింద ట్రంప్ సంతకం బంగారు రంగులో ఉంటుందని చెబుతున్నారు. రెండో పేజీలో మాత్రం అమెరికా వ్యవస్థాపక పితామహుల చారిత్రాత్మక ఫోటో ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ వెల్లడించారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ కు మరీ ఇంత ప్రచార కాంక్ష ఏమిటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

This post was last modified on April 30, 2026 3:36 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago