Political News

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా పనిచేశాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయి విజయాన్ని కూటమి దక్కించుకుంది. నాడు కూటమిని విజయతీరాలకు చేర్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన వ్యూహాలు దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకున్నాయి.

తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులోని అధికార డీఎంకే బాబు నోట వినిపించిన సూపర్ 6ను అందిపుచ్చుకుంది. చెన్నై సూపర్ 6 పేరిట డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పార్టీ హామీలను ప్రకటించారు.

తమిళ రాజకీయాల విషయానికి వస్తే… తమిళనాడు అంతా ఒక ఎత్తు అయితే… 22 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజధాని చెన్నై నగరం మరో ఎత్తు. చెన్నైలో విజయం సాధిస్తే… రాష్ట్రవ్యాప్తంగానూ ఆ పార్టీకి విజయం దక్కి తీరుతుందన్నది అక్కడి మాట. అంతేకాకుండా దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన హేమాహేమీలు నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు.

ప్రస్తుతం స్టాలిన్ తో పాటు ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో సీట్ల నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డీఎంకే చెన్నై సూపర్ 6 పేరిట ప్రత్యేక హామీలను గుప్పించింది. 

బాబు తరహా సూపర్ 6 మాదిరి స్టాలిన్ నోట నుంచి వచ్చిన చెన్నై సూపర్ 6 హామీల విషయానికి వస్తే…చెన్నైలో ప్రధానంగా సౌకర్యాలను మెరుగుపరిచే విషయాలను అందులో ప్రస్తావించారు. నగరంలో వెయ్యి మినీ బస్సులను కొత్తగా ప్రవేశపెట్టడంతో పాటుగా నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగం, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడం, నగరంలో కీలకమైన రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయడం, రహదారుల వెంట చెట్లను పెంచడం, నగరంలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన, మెట్రో రైలు విస్తరణ, వీధి కుక్కల నియంత్రణ, వెటర్నరీ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందిని మూడింతలు పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. ఇక నగరంలో రూ.10 వేల కోట్లతో టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆ హామీల్లో స్టాలిన్ ప్రకటించారు.

This post was last modified on April 20, 2026 10:45 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago