Political News

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే.

మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ నిరసనల్లో పాలుపంచుకున్న వైసీపీ కీలక నేతలు… రాధాకృష్ణపై బూతు దండకం అందుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.

వైసీపీ నేతలపై రాధాకృష్ణ తన కథనంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వాదించిన ఆ పార్టీ నేతలు తమ నిరసనల్లో రాధాకృష్ణపై అవే అనుచిత వ్యాఖ్యలు వినియోగించడం నిజంగానే విస్మయాన్ని కలుగజేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళలను కించపరచడం ఏ ఒక్కరికీ సరికాదనే చెప్పాలి. అయితే వారు మా ఆడవాళ్లను తిడితే… తాము మాత్రం చేతులు కట్టుకు కూర్చోవాలా? అన్న రీతి ఇప్పుడు మరింత ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాలి. వెరసి ఆయా కుటుంబాల్లోని మహిళలు అనవసరంగా బదనాం అయిపోతున్నారు. 

ఏబీఎన్ ముందు ఆందోళనల్లో భాగంగా వైసీపీ  కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనదైన శైలిలో బూతు పురాణం అందుకున్నారు. రాధాకృష్ణను పదే పదే పేరు పెట్టి పిలిచిన ఆయన… ఆంధ్రజ్యోతిని బూతు జ్యోతిగా అభివర్ణించారు. అంతటితో ఆగని జోగి… దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రావాలని రాధాకృష్ణకు సవాల్ విసిరారు.

మరో అడుగు ముందుకేసీ రాధాకృష్ణను నీవు మగాడివైతే… అంటూ మనింత ఘాటు పదజాలాన్ని వినియోగించారు. తాము అధికారంలోకి వస్తే రాధాకృఫ్ణను పరుగెత్తించి కొడతామని కూడా ఆయన వార్నింగిచ్చారు. ఇప్పుడు పోలీసు భద్రత మధ్య క్షేమంగా ఉన్నా.. పోలీసులు ఎప్పుడూ సెక్యూరిటీ ఇవ్వరన్న విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే… రాధాకృష్ణ తన కథనంలో ఏపీ రాజకీయాలను రాస్తే… వైసీపీ మాత్రం ఏపీని వదిలేసి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసనకు దిగడం గమనార్హం.

This post was last modified on April 7, 2026 12:28 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

34 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago