వైసీపీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమరావతి రాజధానిపై మళ్లీ పాత రికార్డే వినిపించారు. అమరావతిపై జగన్‌కు ధ్వేషం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏపీకి చెందిన నాయకుడు కాదా? ఏపీని ఐదు సంవత్సరాలు పాలించలేదా? ప్రజలు ఆయనకు ఓటేయలేదా? అని వరుస ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. అసలు చంద్రబాబు కంటే కూడా జగనే రాజధాని ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నారని గుర్తు చేస్తూ.. పాత క్యాసెట్ రికార్డే ప్లే చేశారు.
తాజాగా ఏపీ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు.. ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ప్రత్యక్షంగా వీక్షించిన పేర్ని నాని.. అనంతరం.. మీడియా ముందుకు వచ్చారు. రాజధానికి చట్టబద్ధత అనేది కేవలం కల్పిత డ్రామాగా ఆయన అభివర్ణించారు. శాసన మండలిని హాజరు పరచకుండా.. కేవలం అసెంబ్లీని మాత్రమే హాజరు పరిచి ఏకగ్రీవ తీర్మానం చేయడం ఏంటని నిలదీశారు. అసలు దీనికి చట్టబద్ధత ఉందా? అని ధర్మసందేహం వ్యక్తం చేశారు.
వైట్ పేపర్ ప్లీజ్.. అంటూ పేర్ని నాని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రాజధానిపై 21 వేల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేశారని.. ఖర్చయిన మొత్తానికి వైట్ పేపర్ ఇవ్వాలన్నారు. కేవలం జగన్‌ను తిట్టిపోయడానికి మాత్రమే సభను ప్రత్యేకంగా హాజరు పరిచారని పేర్కొన్నారు.
ఇక.. జగన్ పాలనా కాలంలోనే అమరావతిలో రోడ్డు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. “రాజధానిపై మనసు ఉండబట్టే జగన్.. మీకంటే ముందుగానే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు“ అని వ్యాఖ్యానించారు. రాజధానిలో అందరూ బాగుండాలనే పేదలకు ఇళ్లు కూడా కేటాయించారు.. అని తెలిపారు.
సీట్ల విషయంలోనూ..
మీరు 131 నుండి 23కు పడింది గుర్తు లేదా.. కేవలం మేము 151 ముందు 11కు పడింది మాత్రమే గుర్తుందా అంటూ లోకేష్ ను ప్రశ్నించారు. కూటమి 23 నుండి 164కు ఎలా వెళ్ళిందో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 11 నుండి 170కు వెళ్లడం తథ్యమని బల్ల గుద్ది చెప్పారు. ఈ వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పేర్ని నాని అంత ధీమా వ్యక్తం చేశారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలను ఎప్పటిలాగే ఇతర వైసీపీ నాయకులు సమర్థించగా.. పేర్ని నాని, వైసీపీ నాయకులు మళ్ళీ కలలు కంటున్నారని.. ఒకసారి 175కు 175 అని చెప్పుకున్నందుకే ప్రజలు 11 స్థానాలకు ప్రజలు సర్దిపెట్టారని ఈసారి అవి కూడా మిగలవని కూటమి నేతలు, అభిమానులు తిప్పి కొడుతున్నారు.
"మేము 151 నుండి 11కు వచ్చిందే కనపడుతుందా? మీరు 131 నుండి 23కి పడ్డారు కదా…!
— Gulte (@GulteOfficial) March 28, 2026
మీరు 23 నుండి 164కి వచ్చినప్పుడు.. మేము 11 నుండి 170కి రాలేమా?"
– #PerniNani pic.twitter.com/UH69kwpbGg
Gulte Telugu Telugu Political and Movie News Updates