Political News

వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌ల‌లో వ‌డివ‌డిగా ముందుకు సాగుతోంది. ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 ల‌క్ష‌ల మంది పైచిలుకు నిరుద్యోగుల‌కు.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌లు చేసింది. గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు.. 20 ల‌క్ష‌ల మందికి ఐదేళ్ల‌లో ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ హామీ మేర‌కు.. నిరుద్యోగుల ఆశ‌లు నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

తాజాగా ప్ర‌భుత్వం వెల్ల‌డించిన స‌మాచారం మేర‌కు.. ప్ర‌భుత్వంతోపాటు ప్రైవేటు ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీ ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6 ల‌క్షల 28 వేల 347 మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. వీటిలో 30607 ప్ర‌భుత్వ ఉద్యో గాలు ఉన్నాయి. ఇక‌, తాజాగా మ‌రో 10 వేల‌కుపైగానే ఉద్యోగాల‌కు సంబంధించి(ఈ సంవ‌త్స‌రం) జాబ్ క్యాలెండ‌ర్‌ను జారీ చేశారు. సో.. మొత్తంగా 21 మాసాల్లో 6 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. మ‌రో 3 సంవ‌త్స‌రాల కాలంలో మిగిలిన 11 ల‌క్ష‌ల మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది.

అంతేకాదు..

ప్ర‌స్తుతం మ‌రో రెండున్న‌ర ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు.. చిన్న, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యో గాలు క‌ల్పించే ప్ర‌క్రియ కూడా ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో జాబ్ మేళాలు.. నిర్వ‌హించ‌డం ద్వారా 1.5 ల‌క్ష‌ల మందికి ప‌లు ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు ఇప్పించేలా ప్ర‌భుత్వం ప్రోత్స హించింది. సో.. మొత్తంగా ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చే క్ర‌మంలో అడుగులు వ‌డివ‌డిగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం.. 12 వ‌ర‌కు త‌గ్గించామని ప్ర‌భుత్వం పేర్కొంది.

This post was last modified on March 21, 2026 7:53 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago