రాజకీయాల్లో నాయకులకు-నాయకులకు మధ్య మాటల తూటాలు పేలడం సహజమే. ఇటీవల కాలంలో దూషణలు కూడా పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలపై ప్రత్యర్థులు, ప్రత్యర్థులపై అధికార పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నాయకులు నోరు చేసుకుంటున్నారు.
వీడు-వాడు నుంచి `నీ..` అనే బూతుల వరకు కూడా నేతలు దిగజారుతున్నారు. అయితే.. వ్యక్తిగత విమర్శల వరకు ఫర్వా ఉన్నా.. దీనికి మించి కుటుంబ సభ్యులను అసలు రాజకీయాలతోనే సంబంధం లేని వారిని కూడా పాలిటిక్స్‌లో ఉదహరించడం.. ప్రత్యర్థులపై కామెంట్లు చేయడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
తాజాగా తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా కీలకంగా తీసుకున్నాయి. 116 మునిసిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు గెలవాలని.. ఏడు కార్పొరేషన్లలో గుండుగుత్తగా విజయం దక్కించుకోవాలని ఇరు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే నాయకులు నోటికి పనిచెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. గత నాలుగు రోజులుగా బీఆర్ ఎస్ అధినేతపై చేస్తున్నవిమర్శలు దారి తప్పుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమ వుతోంది. వాడు-వీడు అనడంతోపాటు.. జాతి పిత అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఓకే.. ఇక్కడి వారు ఈ రెండు పార్టీలు ఏమైనా చేసుకోవచ్చు.
కానీ, ఈ క్రమంలో అన్యం-పుణ్యం ఎరుగని సియామీ కవలలు వీణా-వాణీలను ఉదహరిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజ్ఞుల నుంచి సాధారణ ప్రజల వరకు కూడా అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆయన ఏకాంటెస్టులో ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఎలా ఉన్నా.. అసలు బాధిత యువతులను ఉద్దేశించి.. ప్రభుత్వ శరణాలయంలో జీవితాన్ని సాగిస్తున్న వీణా-వాణీలను సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించడం.. సరికాదని అంటున్నారు. “బీఆర్ ఎస్-బీజేపీలు కలిసిపోయాయ“ని రెండు రోజులుగా సీఎం రేవంత్ విమర్శిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ.. గత రెండు రోజులుగా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంత వరకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా.. ఆ రెండు పార్టీలు చూసుకుంటాయి. కానీ, ఈ క్రమంలో బీఆర్ ఎస్-బీజేపీల మధ్య బంధాన్ని ప్రస్తావిస్తూ.. “వీణా-వాణీ అని తల కాయలు అతుక్కుపోయి.. బాడీలు వేరున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నరు. బీఆర్ఎస్-బీజేపీ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం“ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో వీణా-వాణీలను ప్రస్తావించడం సరికాదన్నది పలువురు చెబుతున్న మాట.
వారు నిజానికి తమ జీవితాన్ని ఎన్నో కష్టాలతో నెట్టుకు వస్తున్నారని తలలు కలిసిపోయి పుట్టినవారు.. ఎంతో కుమిలిపోతున్నారని.. ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో వారి పేర్లను రాజకీయంగా వినియోగించడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 8, 2026 10:46 am
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…