జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ అనుకున్నది సాధించేశారు. దేవర పార్ట్ 1 అంచనాలకు మించి విజయం సాధించడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ వేడుక రెండూ సాధ్యం కాకపోవడంతో అభిమానులను నేరుగా కలుసుకునే అవకాశం తారక్ మిస్ చేసుకున్నాడు. ఆ లోటుని కొంతైనా తీర్చుకునే ఉద్దేశంతో ఇంటర్వ్యూల రూపంలో దేవర ముచ్చట్లు పంచుకుంటున్నాడు. అందులో భాగంగా యాంకర్ సుమతో చేసిన ముఖాముఖీలో ఎక్కువగా సీక్వెల్ కి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఎప్పుడు వస్తుందనేది చెప్పకపోవడం అసలు ట్విస్ట్.
ఇక ముచ్చట్ల విషయానికి వస్తే సుమ ఎంత గుచ్చి గుచ్చి అడిగినా సముద్రంలో అజయ్ కంటపడ్డ కట్టి పారేసిన ఆస్థి పంజరాలు ఎవరివనేది ఎంత వేడుకున్నా ఇద్దరూ బయట పెట్టలేదు. కొరటాల కొంత దయ తలిచి ఒక కళేబరం మాత్రం చాలా కీలకమైన వ్యక్తిదని అదేంటనేది దేవర 2లోనే చూడాలని తేల్చి చెప్పాడు. వర స్వంత తండ్రిని ఎందుకు పొడవల్సి వచ్చిందనే సస్పెన్స్ కూడా అప్పుడే రివీల్ అవుతుందని అన్నారు. జాన్వీ కపూర్ కు తక్కువ నిడివి దొరకడం పట్ల వచ్చిన కామెంట్స్ గురించి తారక్ స్పందించాడు. వర, తంగం మధ్య లోతైన ప్రేమకథ ఉంటుందని, అది రెండో భాగంలో ఉంటుందని అన్నారు.
బదులు లేని ఎన్నో ప్రశ్నలు దేవర 1లో వదిలేసిన కొరటాల శివ వాటికి మెరుగైన సమాధానాలు ఇచ్చేందుకు త్వరలోనే స్క్రిప్ట్ మీద మళ్ళీ వర్క్ చేయబోతున్నారట. ఇప్పుడొచ్చిన స్పందన చూశాక మరింత బాధ్యత పెరిగిందని, అందుకే మరికొన్ని అంశాల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు, కాకపోతే ఇంకో రెండేళ్లకు పైగా పట్టొచ్చనే సంకేతం మాత్రం ఇచ్చారు. ప్రస్తుతం రెండో వారంలో అడుగు పెట్టిన దేవర 500 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. వరస దసరా సెలవుల నేపథ్యంలో ఇంకా పెద్ద నెంబర్ నమోదు కావొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. దసరాకు ఎంత పోటీ ఉన్నా దేవర గట్టిగానే నిలబడేలా ఉంది.
This post was last modified on October 6, 2024 3:24 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…