చిల్ అయిన హేమ .. ఫైర్ అయిన పోలీసులు !

బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ దొరికిందని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లు వెంటనే హేమ ఒక వీడియో విడుదల చేసింది. నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీలు కూడా వీడియోలు విడుదల చేసి తమ మీద వచ్చిన ఆరోపణలను ఖండించారు.

అయితే నటి హేమ చేసిన వీడియో అంతా తూచ్ అని చెబుతున్నారు. రేవ్ పార్టీలో దొరికి పోలీసుల కస్టడీలో ఉన్న హేమ కొంచెం పక్కకు వెళ్లి వీడియో చేసిందని వెల్లడయింది. నటి హేమ చేసిన పనికి పోలీసులు సీరియస్ అయ్యి ఆమె ఫోన్ సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

పోలీసులు విడుదల చేసిన ఫోటోలు, హేమ విడుదల చేసిన వీడియోలో ఆమె సేమ్ డ్రస్ లో ఉన్నారు. వీడియోలో ఉన్న చెట్టు బెంగుళూరు ఫామ్ హౌస్ దే కాగా పక్కనే రేవ్ పార్టీ సెటప్ కూడా కనిపించడం విశేషం. ఇక ఫామ్ హౌస్ నుండి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించింది. అన్ని ఆధారాలు ఉన్నా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హేమ మీద పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.