Gulte TeluguGulte Telugu Telugu Political and Movie News Updates

  • Home
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా రివ్యూ
  • ట్రెండ్స్
  • English
Home/Movie News/పెళ్లి మజిలీ చేరుకున్న కిరణ్ ప్రేమకథ

పెళ్లి మజిలీ చేరుకున్న కిరణ్ ప్రేమకథ

Article by Satya Published on: 4:31 pm, 11 March 2024

తెరమీద హీరో హీరోయిన్లు నిజ జీవితంలో భార్యా భర్తలు కావడం చాలా చూశాం. కృష్ణ విజయనిర్మల, నాగార్జున అమలతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ లిస్టులో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం చేరిపోయాడు. తన డెబ్యూ మూవీ రాజావారు రాణిగారులో జోడిగా నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎల్లుండి 13న పరిమిత అతిథుల మధ్య నిశ్చితార్థం జరిపి త్వరలోనే వివాహ వేడుక చేసుకోబోతున్నారు. నిజానికి ఈ ఇద్దరూ లివ్ ఇన్ లో ఉన్నారని గతంలో కథనాలు వచ్చాయి. ఒక టాక్ షోలో కిరణ్ సిగ్గుపడుతూ ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు కూడా.

ఫైనల్ గా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. హీరోగా అప్ కమింగ్ స్టేజిలో ఉన్న కిరణ్ అబ్బవరంకు వినరో భాగ్యము విష్ణుకథ డీసెంట్ హిట్ తర్వాత మీటర్, రూల్స్ రంజన్ ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం దిల్ రుబా పూర్తి చేసే పనిలో ఉన్న కిరణ్ మరో పీరియాడిక్ డ్రామాని ఒప్పుకున్నాడు. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో హనుమాన్ నిర్మాత గతంలో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశారు కానీ దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రహస్య గోరఖ్ విషయానికి వస్తే తెలుగమ్మాయే. రాజావారు రాణిగారుకు ముందు ఆకాశమంత ప్రేమ లాంటి షార్ట్ ఫిలింస్ పేరు తెచ్చి పెట్టాయి.

తెరంగేట్రం తర్వాత రహస్య మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు. తమిళంలో షర్బత్ అనే మూవీ చేసినా ఫలితం దక్కలేదు. మళ్ళీ తెరమీద కనిపించలేదు. కిరణ్ తో పలు సందర్భాల్లో బయట కనిపించినా తమరిలేషన్ గురించి ఎక్కడ ఓపెన్ కాలేదు. ఒకరకంగా యూత్ హీరోల్లో త్వరగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నది కిరణ్ అనే చెప్పాలి. వెడ్డింగ్ కూడా డెస్టినేషన్ తరహాలో ప్లాన్ చేస్తారట. అదయ్యాక ఇండస్ట్రీకి హైదరాబాద్ లో ఒక రిసెప్షన్ ఇస్తారని తెలిసింది. ఈ కారణంగానే కిరణ్ షూటింగులకు కొంత బ్రేక్ తీసుకుని మూడు ముళ్ళు వేశాక మళ్ళీ సెట్స్ లో అడుగుపెడతాడని సమాచారం.

Tags Kiran abbavaram engagement Rahasya gorak

Latest Stories

  • ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

    56 minutes ago
  • రణబాలికి కాంతార రంగు

    2 hours ago
  • పవన్ పాలనకు చిరు కితాబు

    3 hours ago
  • రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

    4 hours ago
  • పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

    4 hours ago

Most Viewed

  • బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు...
    బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు...
  • 249 కొట్టినా గెలవలేని టీం ఇండియా
    249 కొట్టినా గెలవలేని టీం ఇండియా
  • బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే
    బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే
  • సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు
    సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు
  • ‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్
    ‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్
Gulte
Back To Top

Follow Us

     
  • About Us
  • Editorial Guidelines
  • Privacy Policy
  • Advertise With Us
  • Contact Us
Copyright © 2026 Gulte, All Rights Reserved.