ఆమె హార్ట్ పై కండల వీరుడి ఎటాక్!

హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదా శర్మ గుర్తుందిగా? సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్న క్యారెక్టర్ కూడా చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో చిన్నా చితకా చిత్రాలు చేసుకుంటూ… ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ ఫాలోయర్స్ ని పెంచుకుంటోంది.

సంప్రదాయబద్ధమైన పాత్రలతో మొదలు పెట్టి, ఆనక పద్ధతి మార్చేసిన వారిలో ఈమె కూడా ఉంది. ఇదిలావుంటే ఆదా శర్మ ఒక బాలీవుడ్ కండల వీరుడిపై మనసు పారేసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. కమాండో పేరుతో యాక్షన్ సినిమాల సిరీస్ దించుతోన్న విద్యుత్ జమవాల్ తో ఆమె ప్రేమలో పడిందని బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
కమెండో 2, కమెండో 3 చిత్రాలని అతనితో కలిసి చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆదా ఈ పుకార్లు విననట్టు ప్రవర్తిస్తోంటే, విద్యుత్ మాత్రం త్వరగా స్పందించి అలాంటిది ఏమీ లేదన్నాడు. మరి నిప్పు లేకుండా పొగ ఎలా వచ్చిందో వాళ్ళిద్దరికే తెలియాలి.