అసలే బజ్ లేక కిందా మీద పడుతున్న లాల్ సలామ్ కు మార్నింగ్ షో కష్టాలు వచ్చాయి. తెలుగు ప్రింట్ కు సంబంధించిన సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపుగా చాలా చోట్ల ఉదయం ఆటలు క్యాన్సిల్ చేశారు. ముందే బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ కూడా జరుగుతోంది. మరికొన్ని సెంటర్లలో కనీసం సింగల్ డిజిట్ టికెట్లు తెగక థియేటర్ ఓనర్లు స్వచ్ఛందంగా రద్దు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్ర చేశారని తెలిసి కూడా ఇంత వీక్ రెస్పాన్స్ గతంలో ఎప్పుడూ చూడలేదని బయ్యర్లు ఓపెన్ గా చేస్తున్న కామెంట్.
సమస్య మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పరిష్కారం కావొచ్చు. కొన్నిచోట్ల పడ్డాయని సోషల్ మీడియా ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రజని సినిమాకు జరగాల్సిన అవమానమైతే కాదు ఇది. నిర్మాతలు ప్రమోషన్ల విషయంలో వహించిన నిర్లక్ష్యం ఇప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చేలా చేసింది. ఒకవేళ షోలు ఎప్పుడు మొదలైనా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ అయితే వచ్చేలా లేదు. రజని పోషించిన పాత్ర ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ కలిగించలేదని అర్థమైపోయింది. అసలు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి స్పందన రావడం తలైవా అభిమానులను బాధ పెడుతోంది.
తమిళనాడులో మాత్రం టైమింగ్ ప్రకారం షోలు పడ్డాయి. రిపోర్ట్స్ మిక్స్డ్ గానే ఉన్నాయి. ఫైనల్ రిపోర్ట్ తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విష్ణు విశాల్ హీరోగా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. మ్యూజిక్ ఏమంత ఛార్ట్ బస్టర్ కాలేకపోయింది. ఏఐ టెక్నాలజీ వాడి చనిపోయిన గాయకుల గొంతుని మళ్ళీ సృష్టించినా ఫలితం కనిపించడం లేదు. ఏదైతేనేం చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్ సినిమా ఇలా జీరో హైప్ తో తెలుగులో రావడం ఆశ్చర్యం కన్నా ఎక్కువ విచారం కలిగిస్తోంది
This post was last modified on February 9, 2024 12:19 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…