రెచ్చిపోయిన సుధీర్ బాబు హీరోయిన్

వామికా గ‌బ్బి.. తెలుగులో మ‌రీ పాపుల‌ర్ ఏమీ కాదు ఈ పేరు. సుధీర్ బాబు సినిమా భ‌లే మంచి రోజులో ఈ అమ్మాయే క‌థానాయిక‌. ఆ సినిమాలో త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. త‌మిళంలో మాత్రం కొన్ని సినిమాల్లో న‌టించింది. హిందీ, మ‌ల‌యాళంలో కూడా ఆమె  కొన్ని సినిమాలు చేసింది. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు హాట్ ఫొటో షూట్ల‌తో ఈ అమ్మాయి కాస్త సంద‌డి చేస్తుంటుంది.

ఐతే గురువారం ఓవైపు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ జ‌రుగుతుంటే.. మ‌రోవైపు లియో లాంటి క్రేజీ సినిమా ట్రైల‌ర్ లాంచ్ అయితే.. వామికానే ట్రెడింగ్‌లో నిలిచింది. అందుక్కార‌ణం ఓ వెబ్ సిరీస్‌లో ఆమె మైండ్ బ్లోయింగ్ అనిపించేలా స్కిన్ షో చేయ‌డ‌మే. ఆ సిరీస్ పేరు.. కుఫియా. నెట్ ఫ్లిక్స్‌లో నిన్న అర్ధ‌రాత్రి నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

ట‌బు, అలీ ఫ‌జ‌ల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించిన కుఫియాలో వామికా సెమీ న్యూడ్ సీన్ల‌తో రెచ్చిపోయింది. ఒక సీన్లో ఒంటిపై బ‌ట్ట‌లు విప్పేస్తూ క్లీవేజ్ షోతో ఆమె రెచ్చిపోయింది. అలాగే మ‌రో సీన్లో ఆమె చేసిన బెడ్ రూం సీన్ కూడా హాట్ టాపిక్ అయింది.

వెబ్ సిరీస్‌ల్లో అమ్మాయిలు క్లీవేజ్ షోలు చేయ‌డం కొత్తేమీ కాదు కానీ.. వామికా లాంటి పేరున్న హీరోయిన్ మునుపెన్న‌డూ లేని స్థాయిలో సంచ‌ల‌న రీతిలో క్లీవేజ్ అందాలు చూపించ‌డం, వేడి పుట్టించేలా బెడ్ రూం సీన్లు చేయ‌డంతో ఆమె ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. త‌న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి ఉద‌యం నుంచి. వామికా గురించి తెలియ‌ని వాళ్లు కూడా ఎవ‌రీ అమ్మాయి.. ఇంత హాట్‌గా ఉంది అంటూ ఆరాలు తీసి త‌న హిస్ట‌రీ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ సిరీస్‌తో వామికా బాగానే పాపులారిటీ సంపాదించేలా ఉంది.