Movie News

కాక రేపుతున్న ‘లియో’ పోస్టర్లు

ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘లియో’ ఒకటి. తమిళ టాప్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో.. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న సినిమా కావడం.. సంజయ్ దత్, అర్జున్ ఇలా చాలామంది అగ్ర నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సిినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండగా.. తెలుగులో కూడా హైప్ బాగానే క్రియేట్ అయింది.

తన తొలి చిత్రం నుంచి డ్రగ్ మాఫియా చుట్టూనే కథలు నడుపుతూ.. ఒక సినిమాతో ఇంకో సినిమాకు లింక్ పెడుతుండటం ప్రేక్షకుల్లో ‘లియో’పై మరింత అంచనాలను పెంచుతోంది. ‘లియో’ కథ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. కాగా ఈ సినిమా పోస్టర్లను కూడా ఒక పద్ధతి ప్రకారం.. ఒక కాన్సెప్ట్‌ను అనుసరిస్తూ రిలీజ్ చేస్తుండటం విశేషం.

కొన్ని రోజుల కిందట ‘‘కీప్ కామ్.. అవాయిడ్‌ ద బ్యాటిల్’ అనే క్యాప్షన్‌తో ఒక పోస్టర్ వదిలారు. అందులో విజయ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. మంచు పర్వతాల బ్యాక్‌ ‌డ్రాప్‌లో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. తర్వాతేమో ‘‘కీప్  కామ్.. ప్లాయ్ ద ఎస్కేప్’’ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించాడు”.. ఇక లేటెస్ట్‌గా ‘‘కీప్ కామ్.. రెడీ ఫర్ ద బ్యాటిల్” అంటూ ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్‌ని చూపిస్తూ అతను గన్ను రెడీ చేసుకుంటున్న దృశ్యం పెట్టారు.

ఈ పోస్టర్లలో క్యాప్షన్లను కనెక్ట్ చేసి చూసుకుంటే హీరో పాత్ర, కథ మీద ఒక ఐడియా వస్తుంది. ముందు హీరో గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడుపుతుంటాడు. తర్వాత ప్రత్యర్థులు తనను టార్గెట్ చేసినా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక తప్పదు అనుకున్నాక యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇక చివరి పోస్టర్లో ‘‘డోంట్ బి కామ్.. డు ద బ్యాటిల్’’ తరహా క్యాప్షన్ పెట్టి హీరో విశ్వరూపాన్ని లోకేష్ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాడేమో అనిపిస్తోంది. ఇలా ఒక కాన్సెప్ట్‌తో స్టార్ హీరో సినిమాలకు పోస్టర్లు వదలడం అరుదైన విషయమనే చెప్పాలి.

This post was last modified on September 21, 2023 11:57 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago