రామ్ ‘స్కంద’ రిలీజ్ విషయంలో వెనక్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ముందుగా సెప్టెంబర్ 15 న రిలీజ్ అనుకొని ‘సలార్’ వాయిదాతో ఆ డేట్ లాక్ చేసుకొని సెప్టెంబర్ 28న కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సినిమాకు టీజర్ తో మంచి బజ్ వచ్చింది. టీజర్ చూసి బయ్యర్స్ కూడా ఎట్రాక్ట్ అయ్యారు. కానీ ట్రైలర్ తర్వాత కొంత నెగటివిటీ వచ్చింది. టీజర్ లో కొత్తదనం చూపించిన బోయపాటి ట్రైలర్ లో రొటీన్ యాక్షన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంతో మరో ‘వినయ విధేయ రామ’ అంటూ కామెంట్స్ వచ్చాయి.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. ఒక్కో ఏరియా మెల్లగా క్లోజ్ చేస్తున్నారు. ముందు ఉన్నట్టు హై డిమాండ్ లేదు కానీ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రీ బిజినెస్ బాగానే చేసుకుంటున్నారట. ఇక నాన్ థియేట్రికల్ గా సినిమా ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టిందని తెలుస్తుంది. ఏదేమైనా రిలీజ్ కి ఇంకా పాతిక రోజులే ఉంది. ఇంత వరకూ టీం రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టకుండా సైలెంట్ అయిపోయారు. రామ్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ చేసుకుంటూ ముంబైలో ఉన్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మధ్యలో రెండు మూడు రోజులు కేటాయించే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఇరవై రోజుల్లో టీం చాలా ఎగ్రె స్సీవ్ ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. అసలే మాస్ కంటెంట్ ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న టైమ్ ఇది. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి ప్రమోషన్స్ చేస్తే భారీ ఓపెనింగ్ రావడం పక్కా. మరి రామ్ , బోయపాటి ప్లాన్ ఏంటి ? అసలు ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు ? వారికే తెలియాలి.