Movie News

శెట్టి పొలిశెట్టి.. ఇది రియల్ సక్సెస్

మంచి సినిమాను ఏదీ ఆపలేదు, దానికి ఏ జిమ్మిక్కులూ అవసరం లేదు.. అదే సమయంలో బాగాలేని సినిమాను ఎంత లేపాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఈ రెండు విషయాలూ నిజమే కానీ.. సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా మునిగిపోతుంటాయి. చెత్త సినిమాలు గట్టెక్కేస్తుంటాయి. అందుకే విడుదలకు ముందు సినిమాకు హైప్ తీసుకురావడం చాలా కీలకంగా మారింది.

ఆ హైప్‌తో ఓపెనింగ్స్ తెచ్చుకుంటే చాలు.. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గత వారం వచ్చిన ‘ఖుషి’ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చింది. అది అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఉపయోగపడింది. టాక్ అటు ఇటుగా ఉన్నా వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ డివైడ్ టాక్ వల్ల సోమవారం నుంచి సినిమా క్రాష్ అయిపోయింది. ఇక ఈ వారం వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ పరిస్థితి దానికి భిన్నం.

షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ మీదే అందరి ఫోకస్ ఉండగా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి ఆశించినంత బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా సాగడంతో సినిమా ఫలితం ఏమవుతుందో అన్న భయాలు నెలకొన్నాయి. మార్నింగ్ షోలకు జనం పలుచగా కనిపించారు. కానీ ఈ సినిమాకు టాక్ బాగా ప్లస్ అయింది. మంచి సినిమా.. వినోదానికి ఢోకా లేదు.. ఒక్క నవీన్ పొలిశెట్టి కోసం సినిమా చూడొచ్చు అనే టాక్ స్ప్రెడ్ అయి.. తొలి రోజు సాయంత్రానికి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. యుఎస్‌లో అయితే ఈ సినిమాకు అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి.

సినిమాకు వచ్చిన టాక్‌కు తోడు నవీన్ పొలిశెట్టి రెండు రోజులుగా అక్కడే ఉంటూ సినిమాను ప్రమోట్ చేయడం కూడా ప్లస్ అయింది. శుక్రవారానికే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కుకు చేరువ అయిపోయింది. వీకెండ్ అయ్యేసరికి 7.5 లక్షల డాలర్ల మార్కును అందుకునేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో తొలి రోజును మించి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎలాంటి గిమ్మిక్కులు లేకుండా కేవలం టాక్‌తో రియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.

This post was last modified on September 9, 2023 2:46 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago