Movie News

సితార చేతికి లియో: రిస్కులు లాభాలు

టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటిగా ఇప్పటికే దూసుకుపోతున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ తాజాగా డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగు పెట్టింది. విజయ్ నటిస్తున్న లియోని కొనుగోలు చేసి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎంత మొత్తానికి అనేది బయట పెట్టలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం 21 కోట్ల దాకా ఉండొచ్చని తెలిసింది. ఇప్పటిదాకా విజయ్ కి ఇంత రేట్ తెలుగులో రాలేదు. ఒక డబ్బింగ్ మూవీ అందులోనూ హీరో కనీసం ప్రమోషన్లకు హైదరాబాద్ లో ఏనాడూ కాలు పెట్టని తరుణంలో  ఈ రేంజ్ డిమాండ్ అంటే మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత పెట్టుబడికి కారణం లేకపోలేదు. ఇక్కడ విజయ్ తో సమానంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్రాక్ రికార్డు పని చేస్తోంది. ఖైదీ విపరీత లాభాలు ఇచ్చింది. కమల్ హాసన్ విక్రమ్ దాన్ని పంపిణి చేసిన నితిన్ ఫ్యామిలీకి కనక వర్షం కురిపించింది. దీంతో సహజంగానే అతనికి ఫాలోయర్స్ పెరిగిపోయారు. అందులోనూ భవిష్యత్తులో రామ్ చరణ్, ప్రభాస్ లతో సినిమాలు చేయొచ్చనే ప్రచారం ఈ మధ్య ఊపందుకుంది. ఇక విజయ్ చేసే కంటెంట్ ఎంత రొటీన్ గా ఉన్నా మాస్ ఆడియన్స్ లో తన పట్టు బాగుంది. వారసుడు సీరియల్ లా ఉన్నా డబ్బులు తెచ్చింది.

కొన్ని కోణాల్లో సితారకు రిస్క్ లేకపోలేదు. దసరాకే బాలకృష్ణ భగవంత్ కేసరి వస్తోంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రకటన ఇచ్చింది. వీటిని ఫేస్ చేయడం అంత సులభం కాదు. గుంటూరు కారం లాంటి భారీ ప్రాజెక్టు చేతిలో ఉంది కాబట్టి దాని కోసమైనా కొంచెం రేట్ అటు ఇటుగా డిమాండ్ చేసినా సితార అడిగిన లియో రేట్లకు బయ్యర్లు ఎస్ అంటారు. కాకపోతే పెట్టుబడి మొత్తాన్ని వెనక్కు తేవాలంటే భారీ బ్లాక్ బస్టర్ టాక్ తప్పనిసరి. ఒక పెద్ద స్టార్ హీరో క్యామియో ఉందనే ప్రచారం కూడా ఢిమాండ్ కి కారణం అయ్యింది. ఒకవేళ లియో కనక వర్కౌట్ అయితే టాలీవుడ్ లో విజయ్ రేంజ్ మరింత పెరగడం ఖాయం.

This post was last modified on July 19, 2023 6:46 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago