స్టార్ మా లో “సిక్స్ త్ సెన్స్” ఐదో సీజన్ !

రియాలిటీ గేమ్ షో లలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన షో  “సిక్స్ త్ సెన్స్”. ఇప్పటివరకు నాలుగు విజయవంతమైన సీజన్లలో అద్భుతమైన వినోదాన్ని అందించి, ఐదో సీజన్ ని ప్రారంభించింది స్టార్ మా. ఈ షో  ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూ వచ్చింది.

ఆట ఆడడంలో, ఆడించడంలో ఓంకార్ ది ఒక విలక్షణమైన పంథా. “వన్ సెకన్” అని ఒక షో లో ఓంకార్ చాలా సార్లు ఉపయోగించినా,  సందర్భాన్ని బట్టి,  వాడే పద్ధతిని బట్టి దాని అర్ధం రకరకాలుగా ఉంటుంది. కీలకమైన క్షణాల్లో ఈ “వన్ సెకన్” అటు కంటెస్టెంట్స్ కి, ఇటు ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగించడం ఈ షో ప్రత్యేకత.

కంటెస్టెంట్ ని  కొంచెం తికమక పెడుతూనే  కొంచెం క్లూ ఇస్తూ ఆటని నడిపించడం ఓంకార ప్రత్యేకత. ఆట ఆడుతున్న సమయంలో కంటెస్టెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలో, ఆ నిర్ణయం సరైనదో కాదో బేరీజు వేసుకునే అవకాశం ఇవ్వడం, తనని తాను క్రాస్ చెక్ చేసుకునేలా చేయడం “సిక్స్ త్ సెన్స్” కాన్సెప్ట్ స్పెషాలిటీ.

నాలుగు సీజన్ లలో ఎందరో సెలెబ్రిటీలు ఈ షో లో పాల్గొన్నారు. పాత కొత్త లో కలయికలో మళ్ళీ అదే ఇంటరెస్ట్, అదే క్యూరియాసిటీ సృష్టించడం ఈ ఫార్మాట్ విశిష్టత. ఐదో సీజన్ మరిన్ని ఆకర్షణలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఈ షో కి మంచి స్పందన లభిస్తోంది.

తప్పక చూడండి, “సిక్స్ త్ సెన్స్ సీజన్ 5” మీ “స్టార్ మాలో” ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు.

సిక్స్ త్ సెన్స్ సీజన్ 5” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/lg1dM5nFo9o

Content Produced by: Indian Clicks, LLC