మంటలు పుట్టిస్తున్న తెలుగమ్మాయి

తెలుగమ్మాయిలు తెలుగులో కంటే ఇతర భాషల్లో పాపులర్ కావడం.. ఎక్కువ అవకాశాలు అందుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఎక్కువగా మన అమ్మాయిలు తమిళంలో మెరుస్తుంటారు కానీ.. బాలీవుడ్లో హైలైట్ కావడం తక్కువే. పాత తరంలో జయప్రద, శ్రీదేవి లాంటి వాళ్లు బాలీవుడ్లో మెరుపులు మెరిపించారు కానీ.. ఆ తర్వాత ఎవ్వరూ కూడా హిందీలో మెరిసింది లేదు.

కానీ చాలా ఏళ్ల తర్వాత శోభిత దూళిపాళ్ల అనే తెలుగమ్మాయి బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించింది. ఆమె నేరుగా తెలుగు సినిమాల్లో నటించి ఉంటే ఇలా ఎదిగేదో లేదో చెప్పలేం. కానీ ముందు హిందీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఉన్నంతలో మంచి అవకాశాలే అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ లాంటి సినిమాలు చేసింది. సినిమాలకు మించి వెబ్ సిరీస్‌లతో ఎక్కువ పేరు సంపాదించింది శోభిత.

ఇప్పటికే మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్ లాంటి సిరీస్‌లతో మెప్పించిన శోభిత.. తాజాగా ‘ది నైట్ మేనేజర్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్‌లో అనిల్ కపూర్ లీడ్ రోల్ చేశాడు. ఇందులో శోభిత సూపర్ హాట్‌గా కనిపించి కుర్రాళ్ల మనసులు దోస్తోంది. ఈ సిరీస్‌లో శోభిత హాట్ హాట్ సీన్ల తాలూకు వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్విమ్ సూట్, బికినీల్లో ఆమె అందాలు ఆరబోసిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

శోభిత ఇప్పటికే చేసిన సినిమాలు, సిరీస్‌ల్లో హాట్‌గా కనిపించింది కానీ.. ‘నైట్ మేనేజర్’లో డోస్ ఇంకాస్త పెంచింది. పర్ఫెక్ట్ ఫిజిక్‌తో స్విమ్ సూట్, బికినీల్లో ఆమె మెరిసిన తీరు చూసి వావ్ అంటున్నారు రసిక ప్రియులు. ఈ వీడియోలు చూశాక సిరీస్ మొత్తం చూడాలన్న కుతూహలం కలుగుతోంది వారిలో.