సంక్రాంతికి ముందు క్రిస్మస్ విందు

దసరా తర్వాత Tollywood బాక్సాఫీస్ డల్లయిపోయింది. అందులోనూ నవంబరులో అయితే పరిస్థితి ఏమంత బాగా లేదు. డిసెంబరు తొలి వారంలో ‘హిట్-2’తో మళ్లీ కొంచెం సందడి మొదలైంది. కానీ ఈ వారం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పేరుకు రికార్డు స్థాయిలో 17 సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి తక్కువే.

‘Gurthunda Seethakalam’ ఒక్కటే కొంచెం చెప్పుకోదగ్గది. వచ్చే వారం బాక్సాఫీస్‌ను మొత్తంగా ‘Avathaar 2’ రాసిచ్చేశారు. పోటీగా ఏ సినిమాలూ రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఐతే తర్వాతి వారం క్రిస్మస్ వీకెండ్లో మాత్రం మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.

Sankranthi కంటే ముందు క్రిస్మస్‌కు మినీ విందు చూడబోతున్నాం. ఆ పండక్కి మాస్ మహరాజా రవితేజ సినిమా ‘ధమాకా’ రాబోతుండడం, అది పక్కా మాస్ మసాలా చిత్రంలా కనిపిస్తుండడంతో బాక్సాఫీస్ కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.

రవితేజ మళ్లీ మాస్ రూట్లోకి రావడం.. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే.. ఇలా వరుస హిట్లు కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, రవితేజ సరసన శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్ నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘Dhamaka’కు తోడు ‘18 Pages’ కూడా క్రిస్మస్ వీకెండ్లోనే సందడి చేయబోతోంది.

‘Karthikeya 2’ తర్వాత నిఖిల్-అనుపమ జోడీ నుంచి వస్తున్న సినిమా కావడం.. సుకుమార్ కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో దీని మీదా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పాటలు కూడా బాగానే ఆకర్షిస్తున్నాయి. ఇవి కాక నయనతార డబ్బింగ్ మూవీ ‘Connect’ యువి లాంటి పెద్ద బేనర్ ద్వారా రిలీజ్ కాబోతోంది.

విశాల్ నటించిన మరో అనువాద చిత్రం ‘లాఠి’ కూడా క్రిస్మస్ వీకెండ్‌కే షెడ్యూల్ అయి ఉంది. మొత్తంగా క్రిస్మస్‌కు బాక్సాఫీస్‌ కళకళలాడే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు సంక్రాంతి వరకు సందడి చేసే అవకాశముంటుంది.