జల కన్య స్టైల్ లో జాన్వీ పాప

అతిలోక సుందరి శ్రీదేవి గారి పెద్దమ్మాయి జాన్వి కపూర్ రోజురోజుకు గ్రామర్ డోస్ అమితంగా పెంచుకుంటూ వెళుతుంది. మొదట్లోనే ఆమె బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. నటనతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు చూడకపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియా ప్రపంచంలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను అయితే సంపాదించుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ ఊహించని రేంజ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా కూడా అమ్మడు జల కన్య స్టైల్ గౌనులో చాలా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది. అందంలో అయితే ఈ బ్యూటీ అంచనాలను అందుకుంటుంది కానీ ఇంకా నటిగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోతోంది. ఇక అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. మరి ఈ అందంతో అమ్మడు ఇంకా ఎన్ని రోజులు అవకాశాలు అందుకుంటుందో చూడాలి.