లవ్లీ మృనల్.. చీరకే అందం వచ్చేలా..

సీతారామం సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించిన మృనల్ ఠాగూర్ నటనతోనే కాకుండా తన అందంతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో కూడా ఈ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు చీరలో కనిపిస్తే ఎంత అందంగా ఉంటుందో మరోసారి రుజువు చేసింది.

మృనల్ చీరలో ఇలా కనిపించడంతో చీరకే అందం వచ్చింది అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీని సీతారామం సినిమాలో ట్రెడిషినల్ లుక్ లో మొదటిసారి చూసిన వారు సోషల్ మీడియాలో కాస్త మోడ్రన్ గా కనిపించే సరికి షాక్ అవుతున్నారు. ఆమె మోడల్ గా ఉన్నప్పుడే బికినీ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో హోమ్లీ ట్యాగ్ వచ్చి పడింది. మరి రాబోయే రోజుల్లో మృనల్ ఇంకా ఎలాంటి షేడ్స్ చూపిస్తుందో చూడాలి.