పూనమ్ కౌర్.. పెళ్ళయ్యిందా?ఉత్తుత్తినేనా?

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్ పూనమ్ కౌర్. ఆమె ఎప్పుడు ఏ విషయం మీద కామెంట్స్ చేస్తుందో, ఎవరిని ఇన్ డైరక్టుగా టార్గెట్ చేసి పంచులు పేలుస్తుందో.. లేదుంటే ఎప్పుడు సైబర్ క్రైమ్ వారి వద్దకు వెళ్ళి కంప్లయింట్ ఇస్తుందో ఎవ్వరికీ తెలియదు. మరో ప్రక్కన సినిమాలు చేయదు కాని, హ్యాండ్లూమ్ అంబాసిడర్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో బాగానే ట్రావెల్ అవుతోంది. ఇవన్నీ అటుంచితే.. ఇప్పుడు పూనమ్ కు పెళ్ళయిపోయిందా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఆ మధ్యన అలాంటి రూమర్లను ఆమె ఖండించినా కూడా, ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం సందేహాలు పెంచేస్తోంది.

కర్వాచౌత్ అంటే చంద్రుడ్ని చూసి తరువాత జల్లెడెలో కొత్తగా పెళ్ళయిన పెళ్ళికూతురు మొగుడి ముఖం చూస్తుంది. నిన్న మౌని రాయ్, కత్రినా కైఫ్‌ వంటి స్టారీమణులు అదే పనిచేశారు. తమ భర్తలో కలసి తొలిసారి కర్వాచౌత్ పండుగను చేసుకున్నారు. అయితే పూనమ్ కౌర్ కూడా సడన్ గా జల్లెడ పట్టుకుని ఒక ఫోటో పెట్టేసింది. దాన్ని చూసి షాకైన అభిమానులు.. ఇలాంటి ఫోటోలు పెళ్లయిన అమ్మాయిలేగా పెడతారు, మరి నీక్కూడా పెళ్ళయిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నార్త్ లో ఉన్న ట్రెడిషన్ ప్రకారం పెళ్ళయిన స్త్రీలే ఈ పండగ చేస్తారు. మరి పూనమ్ ఏమన్నా సీక్రెట్ గా పెళ్ళిచేసుకుందా లేదంటే ఉత్తుత్తినే అలాంటి ఫోటో పెట్టిందా అనే విషయం తేలట్లేదు.

నిజానికి సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా కూడా ఇప్పుడు సెలబ్రిటీలకు నిద్రపట్టనివ్వట్లేదు నెటిజన్స్. పలానా ఫోటో ఎందుకు పెట్టావ్, కామెంట్ ఎందుకు చేశావ్, డ్రస్ ఎందుకు వేసుకున్నావ్ అంటూ దంచేస్తున్నారు. చూద్దాం మరి పూనమ్ కౌర్ కూడా ఇప్పుడు తన మ్యారేజ్ గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో.