బాప్ రే బాప్… అదిరిందయ్యా పూజా జీన్స్ అండ్ టాప్..!

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా బిజీగా ఉన్న పూజా హెగ్డే వీలు చిక్కినప్పుడల్లా తనలోని అల్ట్రా – మోడ్రన్ ఫ్యాషన్ గర్ల్ ను మనకి పరిచయం చేస్తుంది. ఈ సారి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ బయట కెమెరాలకు చిక్కిన ఈ అమ్మడు తనలో స్టైల్ యాంగిల్ ను బయటకి తీసింది. తన పల్చటి కలర్ టాప్ కి తగ్గ డెనిమ్ జీన్స్, స్పోర్ట్స్ షూస్ తో తనదైన ఫ్యాషన్ మార్క్ తో అందరినీ ఆకర్షించింది.

ఇన్ని లైట్ రంగుల అవుట్ ఫిట్ కి భిన్నంగా ఆమె చేతిలో ఉన్న నల్లటి సెయింట్ లారెంట్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ మరిన్ని చూపులని ఆమె వైపు మళ్లించింది. టాలీవుడ్ లోని అగ్రతార సమంత తో టాప్ పొజీషన్ కోసం పోటీ పడుతున్న పూజా… సామ్ తో పాటు ఈ ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో కూడా గట్టి పోటీనే ఇస్తుంది.