పిక్ టాక్.. జల కన్య సాగర విహారం

హీరోయిన్లు.. బీచ్.. బికినీ.. ఈ మూడింటికీ కాంబినేషన్ కుదిరిందటే హాట్నెస్ పీక్స్‌కు చేరాల్సిందే. ఈ తరం హాట్ హీరోయిన్లందరూ ఒక్కసారైనా ఈ కాంబినేషన్లో అందాలు ఆరబోసిన వాళ్లే. గత కొన్నేళ్లలో అయితే ఈ తరహా ఫొటో షూట్లు బాగా ఎక్కువైపోయాయి. కొవిడ్ తర్వాత మాల్దీవుల్లాంటి బీచ్ డెస్టినేషన్లు హీరోయిన్లకు ఫ్రీగా వెకేషన్ ఛాన్సిచ్చి బీచ్ టూరిజంకి ప్రమోషన్ ఇప్పించుకుంటున్నాయి. వాళ్ల బిజినెస్ లెక్కల సంగతేమో కానీ.. కుర్రాళ్లకు మాత్రం కనువిందు అన్నట్లే ఉంది.

ఇప్పటికే పలుమార్లు బీచ్‌లో బికినీ అందాలతో విందు చేసిన సీనియర్ హాట్ గర్ల్ రాయ్ లక్ష్మీ ఇప్పుడు మరోసారి అదే తరహాలో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తోంది. ఒడ్డున రకరకాల బికినీలతో ఆమె చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. ఈ ఫొటోలను ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇప్పుడు యంగ్ హీరోయిన్లు వేస్తున్న హాట్ వేషాలు రాయ్ లక్ష్మీ టీనేజీలోనే వేసేసింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా మారిన ఈ అమ్మాయి.. శ్రీకాంత్ సరసన తెలుగులో చేసిన తొలి చిత్రం ‘కాంచనమాల కేబుల్ టీవీ’లోనే వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేసి ‘హాట్ గర్ల్’ అనే ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో చేసిన అనేక చిత్రాల్లో ఆమె ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే.

ఈమెలోని హాట్ యాంగిల్ చూసే హిందీ మూవీ ‘జూలీ-2’లోనూ ఛాన్సిచ్చారు బాలీవుడ్ నిర్మాతలు. అందులోనూ సూపర్ సెక్సీగా కనిపించి మెప్పించిన రాయ్ లక్ష్మీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లతో.. ప్రైవేటు ఫొటోలతో ఎలా కుర్రాళ్లను కవ్విస్తుంటుందో తెలిసిందే. కెరీర్ విషయానికి వస్తే.. రాయ్ లక్ష్మీ పరిస్థితి ఇప్పుడేమంత ఆశాజనకంగా లేదు. తెలుగులో ఆమెకు పూర్తిగా అవకాశాలు ఆగిపోయాయి. తమిళంలో మాత్రం చిన్నా చితకా సినిమాలేవో చేసుకుంటూ ఏదో అలా బండి నడిపిస్తోంది.