మిసెస్ నీహారిక చైతన్య ?

Niharika Marriage

మెగా డాటర్ నీహారక పెళ్లి కుదిరిందని ఈ ఉదయాన్నే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన పెళ్లికి సంబందించిన మరిన్ని వివరాలు రేపు ఉదయం నీహారికనే స్వయంగా వెల్లడించనున్నారు. ముందుగా ఆమె తన ఫేస్ బుక్ పేజీలో చిన్న చిన్న హింట్ లు ఇస్తున్నారు. అయితే మరిన్ని వివరాలు పాఠకుల కోసం ఎక్స్ క్లూజివ్ గా.

వరుడి పేరు చైతన్య అని తెలుస్తోంది. వరుడి తండ్రి గుంటూరు జిల్లాలో టాప్ పోలీస్ అధికారి అని తెలుస్తోంది. ఆగస్టు 13న అధికారికంగా నిశ్చితార్థం నిర్వహించబోతున్నారు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం మంచి రోజులు మళ్లీ దగ్గరలో లేవు అని నాగబాబు ఇంట్లో ఇరువర్గాలు పెళ్లి ఖరారు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరై, అన్నీ ఆయనే దగ్గర వుండి మాట్లాడినట్లు బోగట్టా.