సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణంతో బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన వారసత్వం టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సుశాంత్ సింగ్ ని అంతా కలిసి తొక్కేశారని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో చిన్న నటులను, బ్యాక్ గ్రౌండ్ లేని వారిని బాలీవుడ్ ఎలా చిన్న చూపు చేస్తుందనే దానికి ఉదాహరణగా నీల్ నితిన్ ముకేష్ (సాహో విలన్) వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది.
ఒక అవార్డు ఫంక్షన్ లో షారుఖ్ ఖాన్ అతడిని “నీకు ఇంటి పేరు లేదేంటి” అంటూ కామెంట్ చేసాడు. దానికి భంగపడ్డ అతను హోస్ట్ చేస్తున్న షారుఖ్, సైఫ్ ఇద్దరినీ ‘షటప్’ అన్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది కానీ దీనికి వెనక మరో స్టోరీ ఉంది. అదంతా ఆ షో రక్తి కట్టించడం కోసం షారుఖ్ ఆడించిన నాటకం.
నీల్ అది చేయడానికి భయపడినా కానీ షారుఖ్ ఎంకరేజ్ చేసి నోర్ముయ్యమని అనమని చెప్పాడట. ఆ వేడుకలో ఉన్న కత్రినా కైఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి షారుఖ్ కి సారీ చెప్పమని చెప్పిందట. అలా ఆటను ‘యాక్ట్’ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కి పనికొస్తోంది. అదీ సంగతి.
Gulte Telugu Telugu Political and Movie News Updates