రామ్ – బోయపాటి.. బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్?

బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోయిన్‌తో లావ్ ట్రాక్ న‌డిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌ర్వాత ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న రామ్‌.. ఇటీవ‌ల త‌న 20వ చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మింబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయ‌నున్నారు. అయితే ఈ మూవీలో రామ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను తీసుకోబోతున్నార‌నే మ్యాట‌ర్ తాజాగా లీకైంది.

ఇప్ప‌టికే బోయ‌పాటి ప‌రిణితి చోప్పాను సంప్ర‌దించార‌ని.. ఆమెకు క‌థ న‌చ్చ‌డంలో పాజిటివ్‌గా స్పందించింద‌ని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రామ్‌కు ప‌రిణితికి మ‌ధ్య అదిరిపోయే లవ్ ట్రాక్‌ను బోయ‌పాటి డిజైన్ చేసిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

కాగా, రామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామితో `ది వారియ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నారు. అలాగే ఇందులో రామ్ తొలిసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.