మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద పాత్రను పోషించడం ప్రారంభించిన దగ్గర నుంచి వెన్నంటి వుంటున్నది హీరో నాగార్జున. మొన్నటి మొన్న మంత్రి తలసానితో సమావేశంలో కూడా నాగ్ కీలకంగా వున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 9న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కలవబోతున్నారు. ఇప్పటికే కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కానీ, మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ జరిగినపుడు కానీ బాలయ్యను పిలవలేదు. ఈ విషయమై బాలయ్య కూడా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
మరి ఆంధ్ర సిఎమ్ దగ్గరకు వెళ్లినపుడు అయినా బాలయ్యను పిలుస్తారా? అన్నది అనుమానం. బాలయ్యను పిలవడం అనివార్యం. ఎందుకంటే ఆయన ఆంధ్రలో ఎమ్మెల్యేగా కూడా వున్నారు. కానీ రావడం రాకపోవడం అన్నది బాలయ్య ఇష్టం.
కానీ బాలయ్య వస్తారని తెలిస్తే నాగార్జున వస్తారా? లేదా నాగార్జున వస్తారని తెలిస్తే బాలయ్య వస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే బాలయ్యకు మెగాస్టార్ తో కంటే నాగ్ తోనే కాస్త వైరుధ్యం వుందన్నది ఇండస్ట్రీ టాక్.
పైగా తేదేపా ఎమ్మెల్యేగా జగన్ పై విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు ఆయన దగ్గరకే ఇండస్ట్రీ సమస్యల ప్రస్తావనకు వెళ్తారా? అన్నది కూడా డవుటే. మొత్తం మీద బాలయ్య ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates