సెక్సీ హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారు!

మజిలీ సినిమాలో సమంత స్క్రీన్ షాట్ పెట్టి… ఈమె నాకు అంత అందంగా ఏమీ అనిపించదు అంటూ ఇంస్టాగ్రామ్ లో పూజ హెగ్డే పెట్టడం పెద్ద రచ్చ అయింది. తన అకౌంట్ హాక్ అయిందంటూ పూజ వివరణ ఇచ్చుకున్నా కానీ టీం సమంత అంటూ ఆమెని ట్రోల్ చేసారు.

మరి నిజంగా పూజ అకౌంట్ హాక్ అయిందో లేక ఏమైందో కానీ… మరో హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ అయితే హాక్ అయింది. ఈషా గుప్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా మూడు సార్లు గత వారంలో హాక్ చేశారట. అంతే కాదు పాపం ఆమె పోస్టులు అన్నీ డిలీట్ చేసేసారు. మళ్ళీ ఆ పోస్టులు ఎలా తిరిగి రాబట్టుకోవాలో ఆమెకి తెలియడం లేదు.

మొత్తానికి ఈ లాక్ డౌన్ లో హ్యాకర్లు సెక్సీ హీరోయిన్లని టార్గెట్ చేశారన్నమాట. తన అకౌంట్ హాక్ అయిందని పూజ చెప్తే నమ్మని వాళ్ళు ఈషా స్టోరీ విన్నాక అయినా నమ్ముతారేమో మరి.