మామూలుగా హీరోయిన్లు తెరపైన చాలా హాట్ హాట్‌గా కనిపిస్తుంటారు. బయట ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుంటారు. కానీ టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ రుహాని శర్మ రూటు వేరు. ఆమె తెరపై చాలా వరకు ట్రెడిషనల్ రోల్సే చేస్తుంటుంది. కానీ బయట మాత్రం హాట్ హాట్‌గా కనిపిస్తుంటుంది.
ఒకసారి రుహాని సోషల్ మీడియా అకౌంట్లను తెరిచి చూశారంటే.. అందులో అన్నీ హాట్ పోజులే కనిపిస్తాయి. ఈ అమ్మాయి ఇంత సెక్సీగా ఉంటుందా అనిపిస్తుంది. కానీ తెరమీద మాత్రం అందుకు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తుంటుంది. ఇందుక్కారణం.. కెరీర్లో వేసిన తొలి అడుగే. చి ల సౌ సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్ర చేసిందామె. నటనకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలో రుహాని తన ప్రతిభను చాటుకుంది.
ఐతే కెరీర్ ఆరంభంలో హీరోయిన్ల నటనకు పేరు వచ్చినా రాకపోయినా.. గ్లామర్ ముద్ర పడటం చాలా అవసరం. అది పడితే కెరీర్ మరో స్థాయికి వెళ్లిపోతుంది. రుహాని విషయంలో అలా జరగలేదు. ఆమె మంచి పెర్ఫామర్ అని పేరు రావడమే చేటు చేసింది. చి ల సౌ తర్వాత అన్నీ ‘మంచి’ పాత్రలే వస్తున్నాయి తనకు. గ్లామర్ విందు చేసే క్యారెక్టర్ ఒక్కటీ పడలేదు.
తాజాగా రిలీజైన నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలోనూ అంజలి అనే పాత్రలో సంప్రదాయబద్ధంగా కనిపించింది రుహాని. తన నటనా ఆకట్టుకుంది. కానీ ఇందులో గ్లామర్ యాంగిలే లేకపోయింది. ఇలా వరుసగా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేసి వాటికే ఫిక్సయిపోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ నెస్ చూసి అయినా ఫిలిం మేకర్లు గ్లామర్ క్యారెక్టర్లు ఇస్తే తన కెరీర్‌కు మంచి ఊపు వచ్చే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates