Gulte TeluguGulte Telugu Telugu Political and Movie News Updates

  • Home
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా రివ్యూ
  • ట్రెండ్స్
  • English
Home/Movie News/పూజా హెగ్డేపై సమంత టీం కౌంటర్లు

పూజా హెగ్డేపై సమంత టీం కౌంటర్లు

Article by suman Published on: 1:23 am, 29 May 2020

ఉన్నట్లుండి సమంత వెర్సస్ పూజా హెగ్డే ఇష్యూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వీళ్లిద్దరి మధ్య అసలు విభేదాలు పొడసూపుతాయని ఎవ్వరూ ఊహించలేదు. టీవీలో ‘మజిలీ’ సినిమా చూస్తూ సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో కామెంట్ చేసిందన్నది ఆమె మీద వచ్చిన ఆరోపణ. ఐతే తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా కామెంట్ పెట్టారని పూజా వివరణ ఇచ్చింది. ఆ పోస్టును డెలీట్ చేసింది. అంతటితో వ్యవహారం సద్దుమణిగిందనే అనుకున్నారంతా. కానీ ఇది హ్యాకర్ల పని కాదని.. పూజానే కామెంట్ పెట్టి విమర్శలు రావడంతో డెలీట్ చేసిందని సమంత ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఐతే ఈ ఇష్యూను సమంత, ఆమె సన్నిహితులు సీరియస్‌గా తీసుకుని కౌంటర్లు వేస్తుండటంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది.

సమంత.. ఆమె స్నేహితురాళ్లయిన దర్శకురాలు నందిని రెడ్డి, గాయని చిన్మయి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వీళ్ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణల తాలూకు స్క్రీన్ షాట్లు ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. వాళ్లు పూజా మీద ముగ్గురూ పరోక్షంగా కౌంటర్లు వేశారు. ముందుగా నందిని రెడ్డి.. ‘వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ’ అంటూ సమంతనుద్దేశించి ట్వీట్ వేసింది. ఇక్కడ హ్యాక్ అనే పదం వాడటం పూజాకు కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత చిన్మయి లైన్లోకి వచ్చి.. ‘‘ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్’ అంటూ మెసేజ్ పెట్టింది.

చివర్లో సమంత.. ‘‘జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్’’ అంటూ పంచ్ వేసింది. వీళ్లు ముగ్గురూ ఇంకొన్ని మెసేజ్‌లు కూడా పెట్టారు. అన్నింట్లోనూ పూజా ‘హ్యాకింగ్’ స్టేట్మెంట్ మీద కౌంటర్లు ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్లందరూ పూజా కావాలనే పోస్టు పెట్టిందని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తెలుగులో పూజా ఫస్ట్ రిలీజ్ ‘ఒక లైలా కోసం’లో చైతూ హీరో కాగా.. అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఆమే కథానాయిక అనే విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

Tags Nandini Reddy Pooja Hegde Pooja Hegde Account Hacked Samantha

Latest Stories

  • ‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

    3 hours ago
  • హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

    3 hours ago
  • సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

    3 hours ago
  • గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

    4 hours ago
  • కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

    9 hours ago

Most Viewed

  • మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్
    మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్
  • చరణ్ పాప్ కార్న్ పాయింట్ - ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా
    చరణ్ పాప్ కార్న్ పాయింట్ - ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా
  • ఆర్సీ 17... చెప్పనన్న సుకుమార్
    ఆర్సీ 17... చెప్పనన్న సుకుమార్
  • పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది
    పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది
  • కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు
    కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు
Gulte
Back To Top

Follow Us

     
  • About Us
  • Editorial Guidelines
  • Privacy Policy
  • Advertise With Us
  • Contact Us
Copyright © 2026 Gulte, All Rights Reserved.