తెలుగమ్మాయ్.. ఇంకా బోల్డ్‌గా


తెలుగు హీరోయిన్లపై ఇంతకుముందున్న ముద్రను చెరిపేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఈషా రెబ్బా, తేజస్వి మదివాడ లాంటి ఈ తరం కథానాయికలు. బాలీవుడ్ భామలకు దీటుగా వీళ్లు గ్లామర్ విందు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫొటో షూట్ల విషయంలో వీళ్లు స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు. అందులోనూ తేజస్వి అయితే గత ఏడాది కాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్‌లో కనిపించిన తేజస్వి.. ఆ తర్వాత కథానాయికగా మారినప్పటి నుంచి హాట్ హాట్‌గానే కనిపిస్తోంది. ఇప్పటికే తేజస్వి కొన్ని ఫొటో షూట్లలో క్లీవేజ్ షోలతో కుర్రాళ్లను బాగా రెచ్చగొట్టింది. బికినీ ఫొటో షూట్లు సైతం చేసింది. అయితే ఎంత చేసినా తేజస్వి కెరీర్ అయితే అనుకున్నంతగా ఊపందుకోలేదు. అయినా ఈ అమ్మాయి తగ్గేదే లేదన్నట్లుగా సాగిపోతోంది.

తాజాగా తేజస్వి మరో బికినీ ఫొటో షూట్‌తో జనాల ముందుకు వచ్చింది. ఎక్కడ ఏంటి అనేది తెలియడం లేదు కానీ.. బీచ్‌లో బికినీతో రెచ్చిపోయి పోజులు ఇచ్చింది తేజస్వి. ఇంతకుముందెన్నడూ లేనంత హాట్‌గా దర్శనమిస్తోందామె. సడెన్‌గా చూస్తే ఏ బాలీవుడ్ హీరోయినో అనుకుంటాం. లుక్స్ పరంగా సైతం డిఫరెంటుగా కనిపిస్తోంది తేజస్వి. హాట్‌నెస్ విషయంలో తెలుగు హీరోయిన్లందరినీ ఆమె వెనక్కి నెట్టేసిందనే చెప్పాలి. కానీ ఎంత చేసినా లుక్స్ పరంగా వీక్ కావడం, హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్ రోల్స్‌తోనే ఎక్కువ గుర్తింపు రావడంతో తేజస్విని కెరీర్ ఎప్పుడూ అనుకున్నంత ఊపందుకోలేదు.

కొన్ని నెలల కిందటే తేజస్వి నటించిన ‘కమిట్మెంట్’ సినిమా టీజర్ రిలీజైంది. అందులో ఆమె ఎంత హాట్‌గా కనిపించిందో తెలిసిందే. ఇంటిమేట్ సీన్లకు ఏమాత్రం అభ్యంతరం లేదని.. ఎంత హాట్‌గా అయినా కనిపించడానికి రెడీ అని ఆ సినిమాతో సంకేతాలిచ్చింది. ఈ సినిమా రిలీజ్ తర్వాతైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.