Movie News

మైసా… మరీ ఇంత సైలెన్సా

ఎలాంటి వాయిదా ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పటికైతే మైసా విడుదల తేదీ నవంబర్ 27 లో ఎలాంటి మార్పు లేదు. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ఈ వయొలెంట్ యాక్షన్ డ్రామాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. టీజర్ లో చూపించిన హీంన మాస్ ఆడియన్స్ దృష్టిలో పడింది. ఆ మధ్య రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో రష్మిక డాన్స్ చూసి ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. ఇవి తప్ప టీమ్ నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్లు వేగవంతం చేసే దిశగా ఎలాంటి ప్లాన్లు కనిపించడం లేదు.

చూస్తేనేమో చేతిలో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈపాటికి ప్రచారం హోరెత్తిపోయి ఉండాలి. రణబాలి టైంలో రష్మిక మందన్న ఎంత యాక్టివ్ గా ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో పాల్గొందో అందరూ చూశారు. కానీ మైసా విషయంలో ఆ జోరు కనిపించడం లేదు. ఇది పూర్తిగా తన ఇమేజ్ మీద మార్కెటింగ్ చేసుకున్న సినిమా. వేరే స్టార్లు లేరు. ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ కోసం థియేటర్ కు అదే పనిగా వచ్చే జనాలు ఉండరు. కేవలం శ్రీవల్లి కటవుట్ మీద తెగే టికెట్లే ఎక్కువ.

అలాంటప్పుడు స్పీడ్ పెంచాలి. ఒకవేళ వాయిదా లాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలి. కానీ ఇప్పటికైతే ఆ సూచనలు లేవు. మైసాతో పాటు శర్వానంద్ భోగి కూడా నవంబర్ 27 వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. వారం తిరగడం ఆలస్యం నాగ చైతన్య వృషకర్మ, నితిన్ అలియాస్ రుక్మిణి థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి. అవి వచ్చే లోగా మైసా రికవరీ మాగ్జిమం జరిగిపోవాలి. లేదా యునానిమస్ టాక్ తో కనీసం రెండు వారాలు బలంగా నిలబడాలి. ఇది పెద్ద సవాలే.

జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చిన మైసాలో ఈశ్వరి రావు, శివ కందుకూరి, సముతిరఖని, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్, తారక్ పొన్నప్ప లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టారు. అణుగారిన వర్గాలకు చెందిన ఒక అమ్మాయి దుర్మార్గుల పాలిట కాళీమాతగా అవతరించే పరిస్థితులు ఎందుకు తలెత్తాయనే దాని మీద మైసా రూపొందింది. రష్మిక ఫైట్లు, రిస్కులు చాలానే చేసింది. ప్రమాదం బారిన పడింది కూడా. మరి ఇంత కష్టపడిన సినిమాకు హడావిడి ఎక్కువే చేయాలి. 

This post was last modified on November 18, 2026 11:39 am

Share

Recent Posts

రామాయణ మేనియా.. థియేటర్లలో నాన్‌వెజ్‌కు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…

1 hour ago

బండ్ల గణేష్ కు జైలు శిక్ష

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…

2 hours ago

‘శ‌బ‌రిమ‌ల‌ను తిరుమ‌ల చేస్తా’: సీఎం ప్ర‌క‌ట‌న.. సాధ్య‌మేనా?!

కొన్ని కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయ‌కులు మాత్రం ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని…

3 hours ago

లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…

4 hours ago

ఈ విష‌యంలో మోడీని మెచ్చేసుకున్నారు!

అన్ని విష‌యాల్లోనూ కాక‌పోయినా.. కొన్ని కొన్నివిష‌యాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చూపే చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజ‌ధాని…

5 hours ago

‘వాళ్లంతా మూర్ఖులు.. వారికి సైన్స్ తెలీదు’

కేర‌ళ రాష్ట్రానికి చెందిన న‌టుడు, ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి త‌న నోటికి ప‌ని చెప్పారు. బీజేపీ…

5 hours ago