ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు జాత‌రే..

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ను వెండి తెర మీద చూసి 15 నెల‌లు దాటిపోయింది. చివ‌ర‌గా గ‌త ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్లో బాలీవుడ్ మూవీ వార్-2తో ప‌ల‌క‌రించాడు తార‌క్. ఆ సినిమా అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. అదొక చేదు జ్ఞాప‌కంగా మిగిలింది. చివ‌ర‌గా తార‌క్ ఫ్యాన్స్‌ను మురిపించింది. 2024 సెప్టెంబ‌రులో వ‌చ్చిన దేవ‌ర మూవీతో.
ఈ సంవ‌త్స‌ర‌మంతా తార‌క్ నుంచి ఏ సినిమా రాలేదు.

2026కే అనుకున్న డ్రాగ‌న్ సినిమా వ‌చ్చే ఏడాది జూన్ 11కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో తార‌క్‌ను స్క్రీన్ మీద చూడ‌డానికి సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వ‌స్తోంది అభిమానుల‌కు. కానీ ఒక‌సారి తార‌క్ రీఎంట్రీ ఇచ్చాక మాత్రం అభిమానుల‌ను చిన్న చిన్న గ్యాప్‌ల‌తో మురిపించ‌బోతున్నాడు.

ఏడాది కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలో తార‌క్ నుంచి మూడు సినిమాలు రిలీజ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌లే తార‌క్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అది 2028 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అంటే డ్రాగన్ వ‌చ్చిన 7 నెల‌ల‌కే అనిల్ సినిమాతో అల‌రిస్తాడ‌న్న‌మాట తార‌క్. డ్రాగ‌న్ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ రిలీజైన ఆరు నెల‌ల‌కే రెండోది కూడా రిలీజ్ చేయాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. మిగ‌తా సీక్వెల్స్ లాగా దీని కోసం ఎక్కువ టైం వెయిట్ చేయించాల‌నుకోవ‌ట్లేదు.

ఫస్ట్ పార్ట్ రిలీజ‌య్యే టైంకే రెండో భాగం కూడా చాలా వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటుంది. ప్ర‌స్తుతానికి అనుకున్న దాని ప్ర‌కారం వ‌చ్చే ఏడాది డిసెంబ‌రులో డ్రాగ‌న్-2 రిలీజ్ అట‌. కానీ 2028 సంక్రాంతికి అనిల్ సినిమా ఉంది కాబ‌ట్టి దీన్ని ఆ ఏడాది వేస‌విలో రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. అలా చూసినా 10-11 నెల‌ల వ్య‌వ‌ధిలో తార‌క్ నుంచి మూడు సినిమాలు వ‌స్తాయ‌న్న‌మాట‌. కాబ‌ట్టి నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ‌న్న‌ట్లే.