Movie News

ఆకాశంలో ఒక తార‌ క‌క్కుర్తితో చేసిన సినిమా

వ‌చ్చే వీకెండ్లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్‌లో ఆకాశంలో ఒక తార ఒక‌టి. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ఈ మూవీని.. ప్రేమ ఇష్క్ కాద‌ల్, సావిత్రి లాంటి చిత్రాల‌ను రూపొందించిన ప‌వ‌న్ సాధినేని తెర‌కెక్కించాడు. ఈ సినిమా వెనుక పెద్ద పెద్ద బేన‌ర్లు నిల‌బ‌డ‌డం విశేషం. సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమాస్ భాగ‌స్వామ్యం తీసుకున్నాయి. స్వ‌ప్న సినిమాస్‌ను న‌డిపించే స్వ‌ప్న ద‌త్ ఈ సినిమాలో తాను పార్ట్‌న‌ర్ కావ‌డం గురించి ఆకాశంలో ఒక తార ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తాను క‌క్కుర్తితో ఈ సినిమాలో భాగ‌మైన‌ట్లు ఆమె వ్యాఖ్యానించింది.
ఈ సినిమా త‌న‌ది కాద‌ని.. దీని అస‌లు నిర్మాత‌లు సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం అని.. కానీ తాను అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి వ‌చ్చాన‌ని స్వ‌ప్న చెప్పింది. ఒక సంద‌ర్భంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ఫోన్ చేసి ఈ సినిమా క‌థ విన‌మ‌ని అడిగాన‌ని.. క‌థ విన్నాక ఇంత మంచి సినిమాను వ‌దులుకోకూడదు, మ‌నం కూడా భాగం కావాలి అనే క‌క్కుర్తితో చేసిన సినిమా ఇద‌ని స్వ‌ప్న వ్యాఖ్యానించింది.

దుల్క‌ర్‌తో మ‌ళ్లీ ఒక సినిమా చేయ‌డం ఎంతో ఆనంద‌క‌ర‌క‌మైన విష‌యం అయితే.. అల్లు అర‌వింద్‌తో క‌లిసి పని చేయ‌డం అద్భుత‌మైన అనుభ‌వం అని.. ఈ విష‌యాన్నే త‌న తండ్రితో కూడా చెప్పాన‌ని స్వ‌ప్న పేర్కొంది.
ఆస్ట్రోనాట్ కావాల‌న్న ఒక అమ్మాయి క‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ఒక వ్య‌క్తి ప‌డే త‌ప‌న నేప‌థ్యంలో ఆకాశంలో ఒక తార సినిమా రూపొందింది. ఆ అమ్మాయి పాత్ర‌ను ఎన్నారై తెలుగ‌మ్మాయి సాత్విక వీర‌వ‌ల్లి పోషించ‌గా.. త‌న వెనుక ఉండి న‌డిపించే క్యారెక్ట‌ర్లో దుల్క‌ర్ క‌నిపించ‌నున్నాడు.

ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్, రుహాని శర్మ ముఖ్య పాత్ర‌లు చేశారు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ సినిమా ప్రోమోలు, పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇది గొప్ప సినిమా అవుతుంద‌నే అంచ‌నాలున్నాయి. వ‌చ్చే వీకెండ్లో ఈ న‌గ‌రానికి ఏమైంది-2, ఓం చిత్రాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌బోతోంది ఆకాశంలో ఒక తార.

This post was last modified on November 16, 2026 5:11 pm

Share

Recent Posts

ప్ర‌జ‌లు కోరుకున్నార‌ని `రిజ‌ర్వేష‌న్లు`  ఇవ్వ‌రు!

ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్న కార‌ణంగా ఒక ప్రాంతాన్ని ఒక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేయ‌డం సాధ్యం కాద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక…

1 hour ago

నిఖిల్ ఎదురుచూపులకు బ్రేక్ ఎప్పుడు

అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే…

1 hour ago

`నా ఓటును అమ్ముకోను`… బ్యాలెట్ బ్యాక్స్‌లో 500 నోట్లు-చీటీ!

ఎన్నిక‌లు ఏవైనా డ‌బ్బుల‌తోనే ముడి ప‌డి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయ‌కులు, తీసుకునేందుకు ఓట‌ర్లు కూడా ఎక్క‌డా…

2 hours ago

మెగా ఫ్యామిలీలో కొత్త ‘కుంపటి’

టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే…

2 hours ago

నాగార్జున రూటులో శివరాజ్ కుమార్

శాండల్ వుడ్ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకు ముందు మన ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు…

3 hours ago

ఈ సారి కాంగ్రెస్ ను ఓడించగలిగేది అదేనా?

2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు…

3 hours ago