శాండల్ వుడ్ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకు ముందు మన ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ జైలర్, పెద్ది పుణ్యమాని ఇప్పుడు గుర్తింపు బాగా పెరిగింది. కన్నడలో ఎంత బిజీ ఉన్నప్పటికీ పాత్ర నచ్చితే చాలు ఇతర భాషల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడరు. పెద్దికి ముందు ఆయన క్యారెక్టర్ గురించి ఎంత ఎగ్జైట్ అయ్యారో ఒక ఇంటర్వ్యూలో చూడటం ఫ్యాన్స్ కి గుర్తే. అది పూర్తి అంచనాలు అందుకోలేకపోవడం వేరే విషయం.
అసలు పాయింట్ కు వస్తే అజిత్ కొత్త సినిమా డేర్ డెవిల్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు ఇక్కడే షెడ్యూల్ చేశారట. గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేమ్ ఆధిక్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని నాలుగైదు నెలల్లో పూర్తి చేసి 2027 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. ఇందులో విలన్ గా శివరాజ్ కుమార్ ని ఒప్పించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే అంత నెగటివ్ షేడ్స్ ఆయన ఎప్పుడూ చేయలేదు.
చూస్తుంటే శివన్న నాగార్జునని స్ఫూర్తిగా తీసుకున్నారు కాబోలు. రజనీకాంత్ కూలి ఆశించినంత హిట్ కాకపోయినా అందులో స్టయిలిష్ విలన్ గా నాగ్ కు మంచి మార్కులు పడ్డాయి. క్యారెక్టర్ డిజైనింగ్ మరింత మెరుగ్గా ఉంటే రోలెక్స్ రేంజ్ లో పేలేది కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వైఫల్యం వల్ల కోరుకున్న ఇంపాక్ట్ అయితే రాలేదు. అలాంటి పొరపాటు జరగకుండా శివరాజ్ కుమార్ ని చూపిస్తారట ఆధిక్ రవిచందర్. అజిత్ స్వయంగా అడగటం వల్లే శివన్న ఒప్పుకున్నారని టాక్.
సీనియర్ హీరోలు అప్పుడప్పుడు ఇలా రూటు మార్చి విలన్లు ట్రై చేయడం మంచి పరిణామమే. జగపతిబాబు ఆల్రెడీ దీన్ని విజయవంతంగా చేసి చూపించారు. శ్రీకాంత్ అప్పుడప్పుడు ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. రాజశేఖర్ సిద్ధంగా ఉన్నారు కానీ కథలు తీసుకెళ్లే దర్శకుల కోసం వెయిట్ చేస్తున్నారు. మంచు మనోజ్ మిరాయ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు శివరాజ్ కుమార్ ఈ లిస్టులో చేరుతున్నారు. బాగానే ఉంది కానీ కరుడుగట్టిన శివన్న ఫ్యాన్స్ దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on November 16, 2026 3:47 pm
ప్రజలు కోరుకుంటున్నారన్న కారణంగా ఒక ప్రాంతాన్ని ఒక వర్గానికి రిజర్వ్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక…
అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే…
ఎన్నికలు ఏవైనా డబ్బులతోనే ముడి పడి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయకులు, తీసుకునేందుకు ఓటర్లు కూడా ఎక్కడా…
టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే…
2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు…
వారణాసి అప్డేట్స్ కావాలని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్న వైనం ఈ మధ్య పెరిగింది. ఏప్రిల్…