ఈ వారం విడుదల కాబోతున్న వాటిలో ఎక్కువ ప్రామిసింగ్ గా కనిపిస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార. స్వప్న సినిమా, గీత ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా ఈ మూవీని రూపొందించారు. నిన్న అల్లు అర్జున్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. బయోపిక్ అయినప్పటికీ ఎమోషన్స్ ప్రధానంగా ఒక జంట మధ్య ప్రయాణాన్ని పెద్ద లక్ష్యానికి ముడిపెట్టి తీసిన వైనం విజువల్స్ లో కనిపించింది. ఇవాళ ట్రైలర్ వచ్చింది.
ఎక్కడో ఒక చిన్న పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి కల్పన(సాత్విక వీరవల్లి) కి జీవితంలో ఎప్పటికైనా ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) అవ్వాలనే గోల్ ఉంటుంది. స్కూల్ చదువు నుంచే అందరూ ఈ విషయంలో ఎగతాళి చేసినా కృష్ణ (దుల్కర్ సల్మాన్) ఒక్కడే ఆమెను ప్రోత్సహిస్తాడు. తీసుకెళ్లి స్పేస్ సెంటర్ లో ఈ ప్రాజెక్టు నిర్వహించే లీడర్ (శృతి హాసన్) దగ్గర చేరుస్తాడు. అయితే అనుకున్నంత అందంగా ఇదంతా సాగదు. ఎన్నో అవమానాలు, ప్రమాదాల తర్వాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ.
స్టోరీ పరంగా గుట్టు దాచకుండా నీట్ గా ఉన్నదంతా చెప్పేశారు కాబట్టి ఎలాంటి సస్పెన్స్ లేదు. తెరమీద ట్రీట్ మెంట్ రూపంలో ఎలా చూపించారనేది ఆసక్తి రేపెలా ఉంది. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే ఒక మధ్యతరగతి యువకుడిగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకోగా డెబ్యూ చేస్తున్న సాత్విక వీరవల్లికి నటనపరంగా మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతంతో పాటు క్యాస్టింగ్ లో భాగమైన సీనియర్లు దీనికి వేల్యూ యాడ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.
భావోద్వేగాల మీద నడిచే ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటాయి కాబట్టి ముందుగా ఆ కోణంలో చూసుకుంటే ట్రైలర్ పాస్ అయినట్టే. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి. నవంబర్ 19,20 తేదీల్లో బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువగానే ఉంది. ఆకాశంలో ఒక తార వాటి మధ్య నెగ్గుకురావడం ఈజీనా కాదానేది కంటెంట్ ఎంత బాగా కనెక్ట్ అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ట్రైలర్ టెస్టులో అయితే డిస్టింక్షన్ మార్కులు వచ్చాయి. అసలు పరీక్షే బాకీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates