ఆమె వ‌ద్ద‌ని.. ఆమెతోనే రెండు సినిమాల‌కు కాంట్రాక్ట్

వ‌చ్చే శుక్ర‌వారం ద‌క్షిణాదిన మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా చేసిన ఈ సినిమాతో సాత్విక వీర‌వ‌ల్లి అనే కొత్త‌మ్మాయి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. తన పేరు చూస్తే తెలుగ‌మ్మాయి అని అర్థ‌మ‌వుతుంది. గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమాస్ లాంటి పేరున్న బేన‌ర్లు క‌లిసి నిర్మించిన సినిమాలో, దుల్క‌ర్ స‌ల్మాన్ లాంటి పెద్ద హీరో స‌ర‌స‌న ఒక తెలుగమ్మాయి క‌థానాయిక‌గా ప‌రిచయం కావ‌డం విశేష‌మే.

ప్రోమోలు చూస్తే సాత్విక పెర్ఫామెన్స్ అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటుంద‌నే అంచ‌నాలు క‌లిగాయి. ఐతే నిజానికి ఈ సినిమాలో సాత్విక‌ను క‌థానాయికగా వ‌ద్ద‌ని ఫీల‌య్యార‌ట నిర్మాత అల్లు అర‌వింద్. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌లో కొత్త‌మ్మాయిని పెట్ట‌డం కంటే.. ఎవ‌రైనా పెద్ద హీరోయిన్ ఉంటే బాగుంటుంద‌ని ఆయ‌న అనుకున్నార‌ట‌. అలా అనుకున్న వ్య‌క్తే.. త‌ర్వాత ర‌ష్ చూసిన‌పుడు సాత్విక పెర్ఫామెన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయి త‌న‌తో రెండు సినిమాల‌కు అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు ఆకాంశంలో ఒక తార ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్ల‌డించారు.

సాత్విక పెర్ఫామెన్స్ ఒక బ్లాస్ట్‌లా ఉంటుందని, అంద‌రూ షాకైపోతార‌ని.. త‌న లాంటి సీనియ‌ర్ నిర్మాత ఆమెతో రెండు సినిమాల‌కు గ్రిమెంట్ చేసుకున్నాడు అంటే, ఆమె ఎక‌క‌డికో వెళ్లిపోతుంద‌ని అర్థ‌మ‌ని అర‌వింద్ వ్యాఖ్యానించారు.

సాత్విక యుఎస్‌లో స్థిర‌ప‌డ్డ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె పుట్టి పెరిగింది యుఎస్‌లోనే అయినా.. త‌న‌కు తెలుగు వ‌చ్చు. ఐటీ ఉద్యోగం చేశాక న‌ట‌న మీద ఆస‌క్తి క‌లిగి, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన‌ కాంత సినిమా కోసం ఆమె ఆడిష‌న్ ఇచ్చింది. ఆ సినిమాలో అవ‌కాశం రాక‌పోయిన‌ప్ప‌టికీ, దుల్క‌రే హీరోగా న‌టిస్తున్న ఆకాంశంలో ఒక తార సినిమాలో లీడ్ రోల్ కోసం ట్రై చేసి, ఎంపికైంది. ఆమె రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాకు సైతం ఆడిష‌న్ చేయ‌డం విశేషం. కానీ ఆ సినిమాకు సాత్విక హీరోయిన్‌గా ఫిక్స‌యిందా లేదా అనే విష‌యంలో క్లారిటీ లేదు.