మహానటి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే దాని ప్రభావం ఇండస్ట్రీ మీద ఇంకా చూస్తూనే ఉంటాం. ఆ బ్లాక్ బస్టర్ స్పూర్తితో బయోపిక్స్ వస్తూనే ఉన్నాయి కానీ దాన్ని తలదన్నే క్లాసిక్ వేరొకరు ఇవ్వలేకపోయారు. టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ కు అంతే స్థాయిలో కీర్తి, గౌరవం దక్కాయి. అయితే విచిత్రంగా తర్వాత తను బోలెడు సినిమాలు చేసింది కానీ వాటిలో అత్యధిక శాతం డిజాస్టర్ తక్కువ ఫలితం అందుకోలేకపోవడం విషాదం. అయినా సరే ఆఫర్లు ఆగడం లేదు.
వచ్చే వారం నవంబర్ 20 కీర్తి సురేష్ కొత్త మూవీ ‘సత్యవాన్ సావిత్రి’ థియేటర్లలో అడుగు పెట్టనుంది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ ఆమెకున్న ఇమేజ్ దృష్ట్యా తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. డోరతీ లాగా ఆలస్యం చేస్తే ఓపెనింగ్స్ రావని గుర్తించారు కాబోలు. అయితే సత్యవాన్ సావిత్రి మీద పెద్దగా బజ్ లేదు. ఇది వస్తుందని తెలిసిన కామన్ ఆడియన్స్ కూడా.తక్కువే ట్రైలర్ చూస్తేనేమో అందులో కీర్తి సురేష్ స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక లేడీ లాయర్ కు అనుకోకుండా ఆమె భర్తనే పెద్ద హత్య కేసులో ఇరుక్కుంటే బయటికి తెచ్చే బాధ్యత పడుతుంది. అయితే సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్న టైంలో, అపోజిషన్ లో ఉన్న బలవంతుడైన న్యాయవాదిని తట్టుకుని ఆమె న్యాయ పోరాటంలో ఎలా విజయం సాధించిందనేది అసలు స్టోరీ. పాయింట్ కొంచెం ఇంటరెస్టింగ్ గానే ఉంది. మిస్కిన్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించారు.
ఇప్పుడీ సత్యవాన్ సావిత్రి ద్వారా మరోసారి సావిత్రి పేరు వాడుకుంటున్న కీర్తి సురేష్ కు ఈసారైనా బ్రేక్ దక్కుతుందేమో చూడాలి. గత కొన్నేళ్లలో ఒక్క దసరా మాత్రమే ఆమెకు విజయం అందించింది. మిగిలినవన్నీ ఫ్లాపులే. డోరతీలో చేసింది కూడా క్యామియో లాంటి చిన్న పాత్రే తప్ప మెయిన్ లీడ్ కాదు. వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ సరసన చేస్తున్న రౌడీ జనార్ధన, వెంకటేష్ జోడిగా జనవరి 12 విడుదల తన కెరీర్ ని మలుపు తిప్పుతాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
