బన్నీతో బోయపాటి… మాస్టర్ ప్లాన్ అంటే ఇది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కలయికతో గతంలో సరైనోడు వచ్చింది. బన్నీ మాస్ ఇమేజ్ అమాంతం పెరగడంలో దీని ప్రభావం చాలా ఉంది. ఊర మాస్ తన మీద ఈ స్థాయిలో వర్కౌట్ అవుతుందని ఫిలిం మేకర్స్ గుర్తించింది ఈ మూవీతోనే. అందుకే సరైనోడు ప్రస్తావన వచ్చినప్పుడు అదోరకమైన ఆనందం అల్లు అర్జున్ లో చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు. మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ ఒక అడ్వాన్స్ ఇచ్చారు కానీ దానికి క్లారిటీ ఇప్పుడు వస్తోంది.

రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ కు ఓకే చెప్పిన అల్లు అర్జున్ నెక్స్ట్ లిస్టులో బోయపాటి శీనుని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టేనని ఫిలిం నగర్ అప్డేట్. అది కూడా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇక్కడో విషయం గమనించాలి. దీనికన్నా ముందు అల్లు అర్జున్ తన కిష్టమైన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. కానీ ముందుకు వెళ్ళలేదు. పురాణాల నేపధ్యంలో తను చెప్పిన కథ బన్నీకి అంత నచ్చలేదట.  అదే జూనియర్ ఎన్టీఆర్ గాడ్ అఫ్ వార్ గా మారిందని వినికిడి.

సో ఏ జానర్ అయితే తన నుంచి చేజారిపోయిందో అదే జానర్ లో బన్నీ వేరే సినిమాకు రెడీ కావడం ఆశ్చర్య పరిచే విషయం. ఎందుకంటే పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ వేసే ప్రతి అడుగు ప్యాన్ ఇండియాని టార్గెట్ చేసుకుంటోంది. అలాంటప్పుడు తక్కువ బడ్జెట్ లో ఈజీ గోయింగ్ క్యారెక్టర్లు ఎంచుకోవడం కష్టం. అందుకే బన్నీ కథ నచ్చగానే బోయపాటికి ఒక చెప్పినట్టు తెలిసింది. రాకా విడుదలకు ముందే లోకేష్ కనగరాజ్, బోయపాటి సినిమాలు సమాంతరంగా జరిగే అవకాశం ఉంది.

అంటే త్రివిక్రమ్ తో క్యాన్సిల్ అయిన సబ్జెక్టు లాంటిదేనన్న మాట. ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ గీత ఆర్ట్స్ నుంచి ఆ లాంఛనం ఎప్పుడైనా జరగొచ్చు. రాకా గురించి అప్డేట్స్ ఇంకా మొదలుపెట్టాల్సి ఉంది. అట్లీ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. రెండో  భాగం ఉంటుందా లేదానే అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈలోగా బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యమే. అఖండ 2 తాండవం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బోయపాటికి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాల్సిన అవసరం చాలా ఉంది.