బాహుబలి సహా కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి తెలుగు సినిమాలకు మేలుచేశాయో, చేటు చేశాయో తెలియని పరిస్థితి. మన అగ్ర కథానాయకులు ఒక్కొక్కరుగా పెద్ద బడ్జెట్లలో భారీ కథలు చేయడం మొదులపెట్టగా.. వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్ అయిన సినిమాలు తక్కువ. కానీ హీరోలు మాత్రం ఒక్కో సినిమా మీద ఏళ్లకు ఏళ్లు సమయం పెడుతూ ఒళ్లు హూనం చేసుకుని కష్టపడుతున్నారు. దీని వల్ల వాళ్లు చేసే సినిమాలు తగ్గిపోతున్నాయి. ఫలితాలేమో అంతంతమాత్రంగా ఉంటున్నాయి.
కొన్నేళ్ల ఎదురు చూపుల తర్వాత విడుదలవుతున్న సినిమాలేమో అంచనాలను అందుకోవట్లేదు. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ తప్పట్లేదు. స్టార్ హీరోలు ఈ పాన్ ఇండియా మాయా ప్రపంచం నుంచి బయటికి వచ్చి అప్పుడప్పుడూ అయినా తక్కువ బడ్జెట్లలో మామూలు ఎంటర్టైనర్లు చేస్తే బాగుండని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. కానీ హీరోలు మాత్రం అలా చేస్తే తాము ఎక్కడ తగ్గిపోతామో, తమ రేంజ్ ఎక్కడ పడిపోతుందో అన్నట్లు ఆ ప్రయత్నాలు చేయడం మానేస్తున్నారు.
ఇలాంటి టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలివైన అడుగు వేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా అనౌన్స్ అవడం ఆలస్యం.. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. తారక్ ఫ్యాన్స్ నుంచే కాదు.. అన్ని వైపుల నుంచి ఈ కాంబినేషన్ పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇది చాలా అవసరమైన సినిమా అని.. ఓవైపు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సినిమాలు చేసినా సరే.. మధ్య మధ్యలో ప్రతి స్టార్ ఇలాంటి సినిమా ఒకటి చేయాలని.. అప్పుడే బ్యాలెన్స్ అవుతుందని.. అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషిస్తారని.. ఇండస్ట్రీ కూడా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాన్ ఇండియా సినిమాల పేరు చెప్పి ఏళ్లకు ఏళ్లు అభిమానులకు కనిపించకుండా పోతున్న స్టార్లందరికీ ఈ అనౌన్స్‌మెంట్ కనువిప్పు కావాలనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఒక అడుగు వేసి అందరికీ దారి చూపించాడని.. మిగతా స్టార్లు కూడా ఈ ట్రెండును అందిపుచ్చుకోవాలని అందరు హీరోల అభిమానులూ కోరుకుంటున్నారు. ఇటీవల సీన్ లాంటి సింపుల్ మూవీతో సూర్య సాధించిన సక్సెస్‌ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
